Asianet News TeluguAsianet News Telugu

ఆదుకున్న కరాన్: 246 పరుగులకు ఇంగ్లాండు ఆలౌట్

నాలుగో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాడ్ జట్టు కు భారత బౌలర్లు షాకిస్తున్నారు. ఆరంభంలోనే ఓపెనర్లను పెవిలియన్ కు పంపిన పేసర్లు భారత్  కు శుభారంభాన్ని అందించారు.

india vs england fourth test updates
Author
Southampton, First Published Aug 30, 2018, 4:15 PM IST

భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సుతో ఇంగ్లాండును కరాన్ ఆదుకున్నాడు. అతను 78 పరుగులు చేయడం వల్ల ఇంగ్లాండు 246 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలింది. ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సు ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్ కు దిగింది. గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ధావన్ 3 పరుగులతో, రాహుల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాడ్ జట్టు కు భారత బౌలర్లు షాకిస్తున్నారు. ఆరంభంలోనే ఓపెనర్లను పెవిలియన్ కు పంపిన పేసర్లు భారత్  కు శుభారంభాన్ని అందించారు.

ఇంగ్లాండు 177 పరుగుల స్కోర్ వద్ద ఎనిమిదో వికెట్ ను జారవిడుచుతుంది. అదిల్ రషీద్ ఇషాంత్ శర్మ బౌలింగులో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. 

భారత బౌలర్లను నిలువరించడానికి ప్రయత్నించిన మొయిన్ అలీ చివరకు అశ్విన్ బౌలింగుకు తలొగ్గాడు. అలీ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో ఇంగ్లాండు 167 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

భారత బౌలర్ల ధాటికి  ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. 86 పరుగుల వద్ద ఇంగ్లాండు ఆరో వికెట్ కోల్పోయింది. స్టోక్స్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగులో పెవిలియన్ దారి పట్టాడు.

భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండుకు మరో ధక్కా తగిలింది. లంచ్ విరామం తర్వాత 69 పరుగుల వద్ద ఇంగ్లాండు బట్లర్ వికెట్ కోల్పోయింది. బట్లర్ 21 పరుగులు చేసి షమీ బౌలింగులో వెనుదిరిగాడు.

నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. కుక్ వికెట్ ను భారత బౌలర్ హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు. దీంతో 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.

ఇంగ్లాండ్ జట్టు 28 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.  బెయిర్ స్టో ఆరు పరుగుల వద్దే పెవిలియన్  బాట పట్టాడు. ఇతడు కూడా బుమ్రా బౌలింగ్ లోనే ఔటయ్యాడు. దీంతో బుమ్రా ఖాతాలోకి రెండో వికెట్ చేరింది. 

ఈ టెస్ట్ లో టీం ఇండియా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. మూడో టెస్ట్ లో ఆడిన ప్లేయర్లనే కంటిన్యూ చేసింది. కానీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం రెండు మార్పులు చేపట్టింది. నాలుగో టెస్ట్ లో మోయిన్ అలీ, ఎస్ఎమ్.కుర్రమ్ లకు స్థానం కల్పించింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు అంచనాలు తప్పినట్లున్నాయి. బుమ్రా తన మొదటి ఓవర్ లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ వికెట్ పడగొట్టాడు ఆ తర్వాత మరో ఓపెనర్ కుక్ ను ఇషాంత్ శర్మ ఔట్ చేశారు.  దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 15 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం అలిస్టర్ కుక్,  జానీ బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios