టీం ఇండియా పేసర్ బుమ్రా.. మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 39ఏళ్ల నాటి రికార్డును తాజాగా బుమ్రా బద్దలు కొట్టాడు. 

టీం ఇండియా పేసర్ బుమ్రా.. మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 39ఏళ్ల నాటి రికార్డును తాజాగా బుమ్రా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా 6వికెట్లు తీశాడు. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. 

ఈ ఏడాది ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌తో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌ద్వారా ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు మాజీ స్పిన్ బౌల‌ర్ దిలీప్ దోషి పేరు మీద ఉంది. 1979లో టెస్ట్ అరంగేట్రం చేసిన దిలీప్ ఆ ఏడాది మొత్తం 40 వికెట్ల‌ను తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల త‌ర్వాత బుమ్రా ఆ రికార్డును అధిగ‌మించాడు. ఇక బుమ్రా, దిలీప్ త‌ర్వాతి స్థానాల్లో వెంక‌టేష్ ప్ర‌సాద్ (1996- 37 వికెట్లు), న‌రేంద్ర హిర్వాణీ (1988- 36 వికెట్లు), శ్రీశాంత్ (2006 - 35 వికెట్లు) ఉన్నారు. 

మరిన్ని సంబంధిత వార్తలు

మెల్బోర్న్ టెస్ట్: తప్పులో కాలేసిన విరాట్ కోహ్లీ

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల

ఆసిస్ కెప్టెన్ కి రోహిత్ శర్మ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ