ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్దేశించే అడిలైడ్ మ్యా‌చ్‌లో భారత ఆటగాళ్ళు అద్భుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ విక్టరీకి కారణమైన బ్యాట్ మెన్స్‌ని పొగడ్తలతో  ముంచెత్తుతూ...చెత్త ప్రదర్శనతో పరుగులు సమర్పించుకున్న బౌలర్లపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇలా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

నిర్ణయాత్మక అడిలైడ్ వన్డేలో మొదట ఆసిస్ బ్యాటింగ్ కు దిగి 298 పరుగుల భారీ లక్ష్యాని భారత్‌కు నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాట్ మెన్స్ ని కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఘోరంగా  విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజ్ కేవలం 10 ఓవర్లలోనే ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగని వికెట్లేమైనా పడగొట్టాడా అంటే అదీ లేదు. ఇలా పరుగులను ఆపడంలో, వికెట్లు తీయడం  రెండింట్లోని విఫలమైన సిరాజ్ భారత  అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

మిగతా వన్డే నుండి సిరాజ్ ను తప్పించాలంటూ అభిమానులు ఆగ్రహం సోసల్ మీడియా వేదికన సెటైర్లు విసురుతున్నారు. సిరాజ్ ను కూడా కాఫీ విత్ కరణ్ షో కు పంపించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అలాగే మరో అభిమాని స్పందిస్తూ...లెప్ట్ హ్యండ్ బౌలర్ అంటే జహీర్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేస్తాడేమోనని భావించామని...కానీ మహ్మద సిరాజ్ కు అంత సీన్ లేదని ఈ  మ్యాచ్ ద్వారా అర్థమైందన్నాడు. ఇలా ఆరంగేట్ర మ్యచ్ లోనే చెత్త రికార్డు నమోదుచేసి సిరాజ్ చేదు అనుభవాన్ని చవిచూడటంతో పాటు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

 

ఇంకా సిరాజ్ అదృష్టం బావుండబట్టి టీంఇండియా అడిలైడ్ వన్డేలో విజయం సాధించింది. లేదంటే అతడిపై ఈ విమర్శలు మరీ ఎక్కువగా వుండేవి. ఈ ఓటమికి సిరాజే బాధ్యుడిగా మారేవాడు. 

సంబంధిత వార్తలు

అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్

ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్ శర్మ