ఆడిలైడ్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను అత్యంత అద్భుతంగా విసిరిన బంతి వికెట్లను ముద్దాడి ఖవాజాను పెవిలియన్ కు పంపించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో అతను ఆ ప్రదర్శన చేశాడు.

19వ ఓవరులో జడేజా అత్యంత అద్భుతంగా విసిరిన బంతి వికెట్లను పడగొట్టింది. దాంతో ఖవాజా అవుటయ్యాడు. అతని అద్భుతమైన ఫీల్డింగ్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Cricket.com.au ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. దాన్ని నెటిజన్లు షేర్ చేస్తూ జడేజాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ లో ప్రారంభమైన రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ పై ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.