Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

మరోసారి ఎంఎస్ ధోనీ మ్యాచ్ ఫినిషర్ అనిపించుకున్నాడు. తన అర్థ సెంచరీతో భారత్ ను ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో గెలిపించాడు. మూడు మ్యాచుల సిరీస్ లో భారత్ రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. 

Australia vs India: 2nd oneday updates
Author
Adelaide SA, First Published Jan 15, 2019, 9:36 AM IST

అడిలైడ్: మూడు మ్యాచులో సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి మ్యాచ్ ఫినిషర్ అనిపించుకున్నాడు. ఉత్కంఠగా మారిన మ్యాచులో దినేష్ కార్తిక్ తో కలిసి సమయోచితంగా ఆడి ధోనీ భారత్ కు విజయాన్ని అందించాడు. దీంతో సిరీస్ ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. దీంతో మూడో మ్యాచును సజీవంగా ఉంచింది. 

విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కష్టాల్లో పడిన భారత్ ను ధోనీ, దినేష్ కార్తిక్ కలిసి గట్టెక్కించారు. 298 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ముగించారు. ధోనీ 54 బంతుల్లో రెండు సిక్స్ ల సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీనేష్ కార్తిక్ 14 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండర్ హార్ఫ్, రిచర్డ్సన్, మాక్స్ వెల్, సోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు. 

ఆస్ట్రేలియాపై జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 242 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. అప్పటికి భారత్ విజయానికి 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ 112 బంతులు ఆడి 104 పరుగులు చేశాడు. ధోనీ సిక్స్ తో ఫిఫ్టీ చేశాడు. అంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 108 బంతుల్లో అతను సెంచరీ సాధించాడు.విరాట్ కోహ్లీ 66 బంతుల్లో అతను అర్థ సెంచరీ చేశారు. ఆ తర్వాత అంబటి రాయుడు 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ 160 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.ఆస్ట్రేలియాపై 101 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ స్టోయినిస్ బౌలింగులో 43 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 32 పరుగులు చేసి బెహ్రాండార్ఫ్ బౌలింగులో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి శిఖర్ ధావన్ పెవిలియన్ చేరుకున్నాడు.

భారత్ పై మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అస్ట్రేలియా తన ఇన్నింగ్సును సిక్స్ తో ముగించింది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లియోన్ 12 పరుగులతో, బ్రెండర్ హార్ఫ్ 1 పరుగుతో నాటవుట్ గా మిగిలారు. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి బంతిని లియోన్ సిక్స్ గా మలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు 4 వికెట్లు దక్కాయి. మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. జడేజాకు ఒక్క వికెట్ లభించింది.

భారత్ పై జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 49వ ఓవరులో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 286 పరుగుల వద్ద రిచర్జ్సన్ షమీ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత వెంటనే భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అదే స్కోరు వద్ద ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిడిల్ డకౌట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ షేన్ మార్ష్, మాక్స్ వెల్ భారత బౌలర్లను ఆటాడుకున్నారు. వారిద్దరిని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. మార్ష్ 123 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 131 పరుగులు చేశాడు. మాక్స్ వెల్ 37 బంతుల్లో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో ఆస్ట్రేలియా 287 పరుగుల వద్ద మార్ష్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో ఓ వైపు వికెట్లు పడిపోతుంటే షేన్ మార్ష్ అద్భుతంమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. 108 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

కీలకమైన రెండో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా భారత్ పైల 82 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఖవాజా 21 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. 134 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హ్యాండ్స్ కోంబ్ జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆస్ట్రేలియా 189 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ షమీ బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి స్టోయిన్స్  29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ లో రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ పై ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 19 బంతుల్లో 6 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. కారే 27 బంతుల్లో 18 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగులో ధావన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios