Asianet News TeluguAsianet News Telugu

డిగో.. 'గాడ్ ఆఫ్ హ్యాండ్', జెఫ్రీ హ్యాట్రిక్‌తో ఇంగ్లండ్‌కు కప్

డిగో.. 'గాడ్ ఆఫ్ హ్యాండ్', జెఫ్రీ హ్యాట్రిక్‌తో ఇంగ్లండ్‌కు కప్

Historical goals that created marvellous moments

ఫుట్‌బాల్ చరిత్ర గతిని మార్చిన మరపురాని గోల్స్
హైదరాబాద్: చరిత్ర వర్తమానానికి దిక్సూచి లాంటిది. మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్ విషయానికి వస్తే అది ఫ్యాన్స్‌కు ఒక మొమరలబుర్ మూమెంట్స్‌తో కూడుకున్న అద్భుతాల గని. అప్పటి గేమ్స్ చూసిన పెద్దవాళ్ళు చెబుతుంటే.. వినేవారికి, చెప్పేవారికి వచ్చే మజాయే వేరు.  అంతటి గ్రేటేస్ట్ ఫుట్‌బాల్ హిస్టరీని తిరగరాసిన కొన్ని ఫెంటాస్టిక్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గోల్స్, వాటిని చేసిన ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

1998 వరల్డ్ కప్: నెథర్లాండ్స్ వెర్సెస్ అర్జెంటీనా: డెన్నిస్ బెర్గ్‌క్యాంప్
నెథర్లాండ్స్, అర్జెంటీనా మధ్య టోర్నమెంట్ క్వార్టర్స్ ఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఇంతలో 1-1 దగ్గర మ్యాచ్ టై అయ్యింది. అప్పుడే రెచ్చిపోయాడు డెన్నిస్ బెర్గ్‌క్యాంప్. కోట్లాది ప్రేక్షకులు, ప్రత్యర్థి ప్లేయర్స్ మతిపోయేలా అద్భుతమైన గోల్ చేశాడు. నెథర్లాండ్స్‌కు సెమీఫెనల్స్‌లో బెర్త్ కన్‌ఫర్మ్ చేశాడు. 

1986 వరల్డ్ కప్: అర్జెంటీనా వెర్సెస్ ఇంగ్లండ్: డిగో మరడోనా
కార్వర్ట్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై డిగో మరడోనా చేసిన ఒక గోల్ మోస్ట్ పాపులర్ గోల్‌గా మిగిలిపోతే, అదే గేమ్‌లో డిగో చేసిన మరో గోల్.. శతాబ్దపు మేటి గోల్‌గా నిలిచిపోయింది. 
గేమ్‌ 56వ నిముషం వద్ద మరడోనా చేసిన గోల్‌కు ఇంగ్లండ్ టీమ్‌లో ప్రతి ఒక్క ప్లేయర్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినంత పనైంది. సెమీ‌ఫైనల్స్‌లో అర్జెంటీనాకు చోటు ఇచ్చింది.

1970 వరల్డ్ కప్: ఇటలీ వెర్సెస్ వెస్ట్ జర్మనీ: రివెరా
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన సెమీ ఫైనల్ గేమ్‌గా చోటు దక్కించుకుంది. అదెలాగంటే.. గేమ్ మొదలైన 90 నిముషాల్లో ఇటలీ, వెస్ట్ జర్మనీ టీమ్స్ 2-2 చేశాయి. పరిస్థితి చూస్తే ఇంకేముంది డ్రా అయిపోతుంది అన్నట్టుగా ఉంది. అనంతరం 109వ నిముషం వద్ద వెస్ట్ జర్మనీ చేసిన గోల్‌తో 3-3 అయ్యింది. అంకె పెరిగింది కానీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. చూస్తున్న ప్రేక్షకులకు ఉత్కంఠకు తోడు బోలెడెంత వినోదం. 
అయితే 111వ నిముషం వద్ద రివెరా చేసిన నాల్గవ గోల్‌తో స్కోర్ 4-3 అయ్యింది. ఇటలీని ఫైనల్స్‌కు చేర్చింది.

1966 వరల్డ్ కప్: ఇంగ్లండ్ వెర్సెస్ వెస్ట్ జర్మనీ: జెఫ్రీ హస్ట్
జెఫ్రీ హస్ట్ అనేవాడు లేకపోతే ఇంగ్లండ్‌కు ఎప్పటికీ వరల్డ్ కప్ ట్రోఫీ దక్కేది కాదని అప్పటి గేమ్ చూసిన అభిమాన కురువృద్ధులు ఇప్పటికీ అంటుంటారు. ఫైనల్ గేమ్‌లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెస్ట్ జర్మనీ నిలిచింది. తొలి 90 నిముషాల్లో గేమ్ డ్రాగా ముగిసింది.
ఎక్స్‌ట్రా టైమ్‌లో జెఫ్రీ చేసిన వివాదాస్పద గోల్ ఇంగ్లండ్‌కు ఊపిరి పోసింది. ఆ తర్వాత అతడు చేసిన హ్యాట్రిక్ ఇంగ్లండ్‌కు తొలిసారిగా వరల్డ్ కప్ ట్రోఫీ అందించింది. అలాంటి మహద్భాగ్యం ఇంగ్లండ్‌కు దక్కడం అదే మొదటిసారి.. చివరిసారి కూడా.

1986 వరల్డ్ కప్: అర్జెంటీనా వెర్సెస్ ఇంగ్లండ్: డిగో మరడోనా
చరిత్రాత్మక గోల్స్ చేసిన ప్లేయర్స్ లిస్టులో డిగో మరడోనా చోటు దక్కించుకోవడం ఇది రెండవ సారి. 
51వ నిముషం వద్ద మరడోనా చేతితో చేసిన గోల్.. 'గాడ్ ఆఫ్ హ్యాండ్' ‌గోల్ అనే పేరు సంపాదించుకుంది. అర్టెంటీనాకు వరల్డ్ కప్ తెచ్చి పెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios