భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పై ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. అలాగే ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఆమె ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐసీసీ ఈ చర్యకు పూనుకుంది.
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంఫైర్లపై ప్రవర్తించిన విధానంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. జూలై 24వ తేదీన జరిగిన మ్యాచ్ లో కౌర్ అంపైరింగ్ నిర్ణయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. స్టంప్స్ పై కొట్టడం, అంపైర్ తన్వీర్ అహ్మద్ కు నిరసనగా సైగలు చేసింది.
ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం.. మహిళను హోటల్ కు పిలిపించి అత్యాచారం..
ఇలా చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని ఐసీసీ భావించింది. దీంతో ఆమెపై రెండు మ్యాచ్ ల సస్పెన్షన్ విధించినట్టు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ లోని ఆర్టికల్ 2.8ను ఆమె ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది. అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించి బహిరంగంగా విమర్శలు చేసినందుకు కౌర్ కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది.
తన బ్యాట్ తో స్టంప్స్ ను పగులగొట్టడం, మ్యాచ్ అనంతర వేడుకల్లో ఎంపైర్లపై కామెంట్లు చేసినందుకు ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. కాగా.. ఆటగాళ్ల ప్రవర్తనను నియంత్రించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తొలి మహిళా క్రికెటర్ గా ఆమె నిలిచారు.
