ఆ రహస్యాన్ని బయటపెట్టిన పివీ సింధూ

First Published 28, May 2018, 1:30 PM IST
Girls, don’t let something as normal as periods come in the way of your dreams
Highlights

అమ్మాయిలకు ఆ విషయంలో సలహా ఇచ్చిన సింధూ

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తేలుగు తేజం...  పీవీ సింధూ సంచలన రహస్యాన్ని అమ్మాయిలకు వెల్లడించారు. ప్రపంచ రుతుస్రావం పరిశుభ్రత దినం సందర్భంగా పీవీ సింధూ అమ్మాయిలకు పలు సలహాలిచ్చారు. జీవిత లక్ష్యాలు సాధించి కలను సాకారం చేసుకోవడానికి అమ్మాయిలకు పిరియడ్స్ ఆటంకం కారాదని సింధూ అభిలషించారు. రుతుస్రావం సమయంలోనూ లక్ష్యసాధనలో ముందడుగు వేయాలని ఆమె అమ్మాయిలకు సూచించారు. 

‘‘నాకు మొదటిసారి రుతుస్రావం వచ్చినపుడు బ్యాడ్మింటన్ అకాడమీలో ఉన్నాను...నా సీనియర్ నుంచి నాచురల్ ప్యాడ్ తీసుకొని సుధీర్ఘంగా ప్రాక్టీసు కొనసాగించాను’’ అని పీవీ సింధూ తన రహస్యాన్ని వెల్లడించారు. తన కలను సాకారం చేసుకోవడానికి మొదట్లో పలు అడ్డంకులు ఎదుర్కొన్నానని, రోజు ఇంటి నుంచి బ్యాడ్మింటన్ అకాడమీకి 56 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఒకవైపు నిరంతర శిక్షణ, మరోవైపు చదువును బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డానని సింధూ పేర్కొన్నారు. పిరియడ్స్ సమయంలో మానసికంగా, భౌతికంగా అలసిపోయినా కల నెరవేర్చుకునేందుకు అమ్మాయిలు పట్టుదలగా శ్రమించాలని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ సలహా ఇచ్చారు.

loader