ఫిఫా వరల్డ్‌ కప్ 2018 లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు ఫేలవమైన ఆటతీరుతో  గ్రూప్‌ దశలోనే వైదొలిగింది. గ్రూఫ్ ఎప్ లో దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైన జర్మనీ నాకౌట్ కు చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఇలా ప్రపంచ నెంబర్ వన్ జర్మనీ జట్టు గ్రూప్ దశలో 1938 నుండి ఇప్పటివరకు ఎప్పుడూ గ్రూప్ దశలో వేనుదిరగలేదు. కానీ ఈసారి ఆ  అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

బుధవారం దక్షిణ కొరియా, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచ ర్యాకింగ్స్ లో మొదటి స్థానంలో వున్న జర్మనీ జట్టు, 57వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా చేతిలో  2-0 గోల్స్ తేడాతో ఓటమిపాలయ్యింది. ఆట ఆరంభం నుంచి  బాల్ జర్మనీ కంట్రోల్లో ఉన్నప్పటికీ దక్షిణ కొరియా అడుగడుగునా అడ్డు తగులుతూ గోల్ చేయకుండా ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ నువ్వా, నేనా అన్నట్టు సాగింది.

ఈ మ్యాచ్ లో ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండాఫ్ చివర్లోని 91వ నిమిషంలో కిమ్ యాంగ్ గైన్, 95వ నిముషంలో సాన్ హెంగ్ మిన్ మరో గోల్ సాధించడంతో దక్షిణ కొరియా 2-0తో జర్మనీపై ఘన విజయం సాధించింది.

"