హైదరాబాద్: డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త 81వ నిముషంలో అందివచ్చిన గోల్‌తో ఫ్రాన్సు‌కు విజయాన్ని కట్టబెట్టింది. గ్రూప్-సిలో 2-1తో ఆస్ట్రేలియాపై శనివారం నాటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో గెలిచింది. తొలి మ్యాచ్‌తోనే బోణి చేసింది. అయితే ఫస్టాఫ్‌లో ఇరు జట్లు చేసిన మిస్టేక్స్ వల్ల ఫ్రాన్స్‌కు చెందిన కోరింటిన్ టోలిస్సో, ఆసిస్ ప్లేయర్స్ ఆజిజ్ బెహిచ్, మ్యాథ్యూ లెకీ, జోష్ రిస్టాన్ ఎల్లో కార్డ్ చూడాల్సి వచ్చింది. 


మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఇరు జట్లు ఆరంభం నుంచే నువ్వా నేనా అన్నట్టుగా ఆడటంతో ఫస్టాఫ్‌లో ఏ ఒక్కరూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. సెకాండాఫ్‌లో కూడా మ్యాచ్ అలాగే సాగుతుండగా 58వ నిముషం వద్ద ఫ్రాన్సుకు పెనాల్టి కిక్ కొట్టే ఛాన్స్ దక్కింది. దాంతో ఆంటోని గ్రేజ్‌మెన్ ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకొని జట్టుకు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 63వ నిముషం వద్ద ఆస్ట్రేలియాకూ ఇదే ఛాన్స్ రావడంతో  జెడ్నాక్ గోల్ చేసి 1-1తో స్కోర్ సమం చేశాడు. అక్కడి నుంచి 81వ నిముషం దాకా అంతా మ్యాచ్ డ్రాగా ముగుస్తుని భావిస్తున్న తరుణాన ఫ్రాన్స్ ప్లేయర్ పోగ్బా గోల్ చేసి 2-1తో టీమ్‌కు ఆధిక్యతను అందించాడు. ఆ తర్వాత మొదట్లో లాగానే ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ టైమ్ అయిపోవడంతో ఫ్రాన్స్ విజేత అయ్యింది. ఆంటోని గ్రేజ్‌మెన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు.