హైదరాబాద్: గోల్స్ సంగతి గోల్ కీపర్‌కెరుగు.. అసలు ఒక్క గోల్ కూడా చేయకుండానే ఆటను ఏం రేంజ్‌లో రక్తి కట్టించవచ్చునో మంగళవారం నాటి గ్రూప్ సి మ్యాచ్‌లో ఫ్రాన్స్, డెన్మార్క్ జట్లు ఫుట్‌బాల్ ప్రపంచానికి చాటి చెప్పాయి. అయినా కానీ చివరిదాకా గోల్ చేద్దామని రెండు టీమ్స్ మాగ్జిమమ్ ట్రయ్ చేశాయి. ఫైనల్‌గా 0-0తో మ్యాచ్ డ్రా చేశాయి. అలా ప్రస్తుతపు వరల్డ్ కప్ టోర్నీలో గోల్ చేయకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. అయినా కానీ రెండు జట్లు డైరెక్టుగా నాకౌట్‌కు చేరుకున్నాయి.


ఆట మొదలైనప్పటి నుంచి ఫ్రాన్స్ జట్టు బాల్‌ను తన కంట్రోల్‌లోనే ఉంచుకుంది.అయినప్పటికీ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఫ్రాన్స్ ప్లేయర్స్ గోల్ కోసం ఎంతలా ట్రయ్ చేస్తే డెన్మార్క్ ఆటగాళ్ళు అంతలా అడ్డుకున్నారు. మాజీ ఛాంపియన్ పైగా ఫేవరేట్‌‌ అని బరిలోకి దిగినప్పటికీ డెన్మార్క్ ఎత్తుగడల ముందు ఫ్రాన్సు ఆటలు సాగలేదు. అలా ఫస్టాఫ్ గోల్స్ ఏమీ లేకుండానే ముగిసింది.


సెకండాఫ్‌లోనైనా గోల్స్ చేద్దామన్న ఫ్రాన్సు ఆశలను డెన్మార్క్ నీరుగార్చింది. అడుగడగునా అడ్డుకుంటూ ప్రత్యర్థి ప్లేయర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. స్టేడియంలో ప్రేక్షకులు మాత్రం మ్యాచ్‌ను మస్తుగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నువ్వా నేనా అన్న రీతిలో బాల్‌తో ఇరు జట్లు సాగిస్తున్న సమరాన్ని వీక్షిస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. చివరికి 0-0 తో మ్యాచ్ డ్రా అయ్యింది.