నాకౌట్లో ఉరుగ్వే... ఉరుగ్వే ఫ్యాన్స్ ఏమన్నారంటే.. (వీడియో)

FIFA world Cup: Uruguayans react to Saudi Arabia win
Highlights

నాకౌట్లో ఉరుగ్వే...  ఉరుగ్వే ఫ్యాన్స్ ఏమన్నారంటే

ఫిఫా వరల్డ్ కప్ : నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగుతోంది. ఈ సారి ఉరుగ్వే, రష్యా జట్లు నాకౌట్లో అడుగుపెట్టాయి. బుధవారం సౌదీ అరేబియాను ఉరుగ్వే ఓడించడంతో గ్రూప్-ఎ లో ఎవరు నాకౌట్ చేరేది తేలిపోయింది. వరుసగా రెండో విజయంతో ఉరుగ్వే ప్రపంచకప్ నాకౌట్‌కు దూసుకెళ్లింది.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 1-0 తేడాతో సౌదీ అరేబియాను ఓడించింది. తమ జట్టు నాకౌట్‌కే చేరడతో ఉరుగ్వే ప్రజలు సంబరాలు చేసుకున్నారు.. రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ.. తమ ఆటగాళ్లను ఆకాశానికెత్తేశారు. మ్యాస్ట్రో చెప్పినట్లుగానే జరిగిందని.. ఉరుగ్వే గెలుస్తుందని.. క్వాలీఫై అవుతుందన్నారు.. ఆట చాలా నిదానంగా సాగిందని.. బాగా బోర్ కొట్టిందన్నారు.. ఆటగాళ్లు ఇంకొంచెం బాగా ఆడి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.. రెండు జట్లను ఓడించినట్లుగానే తమ జట్టు రష్యాను కూడా ఓడిస్తుందని... తామంతా ఇందుకోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. సురెజ్, కావిన్‌పై నమ్మకం ఉంచుతున్నామన్నారు.

                        "

loader