Asianet News TeluguAsianet News Telugu

జర్మనీకి ఇలా హంగేరీ షాక్.. 1950వ దశకంలో సాకర్ రారాజు హంగేరీ

జర్మనీకి ఇలా హంగేరీ షాక్

FIFA World Cup Flashback: West Germany defy the odds in 1954

హైదరాబాద్: ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే 1954 సాకర్ కప్ టోర్నీలో వెస్ట్ జర్మనీ జట్టును దిగ్భ్రాంతికి గురి చేసిన హంగేరియా జట్టు ఒక రికార్డు. అంతే కాదు అత్యంత హింసాత్మకంగా సాగిన మ్యాచ్‌ల్లో ఒకటిగా రికార్డు నమోదు చేసింది. తొలి ఎనిమిది నిమిషాల్లోనే వెస్ట్ జర్మనీ చకచకా రెండు గోల్స్ సాధించి పై పట్టు సాధించింది. కానీ అనూహ్యంగా కోలుకున్న హంగేరియా మూడు గోల్స్ సాధించి మ్యాచ్ గెలుచుకున్నది. 

టోటల్ ఫుట్‌బాల్ ఆటకు బ్రాండ్‌ హంగేరియా

హంగేరియా జట్టు 1950 వ దశకంలో ‘టోటల్ ఫుట్‌బాల్’ ఆటకు బ్రాండ్‌గా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. తనకంటూ సొంత బ్రాండ్ నెలకొల్పింది. వరుసగా 27 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి 1954 టోర్నమెంటులో పాల్గొనేందుకు వచ్చిన మాజికల్ మాగ్యార్స్ జట్టు వ్యతిరేకంగా నిలబడి.. డబ్బు ఖర్చు చేసేందుకు ఏ ఒక్కరికీ ధైర్యం చాలలేదంటే అతిశయోక్తి కాదు. 

నాలుగు మ్యాచ్‌ల్లోనే 25 గోల్స్‌తో ఇలా రికార్డు

నాడు ప్రముఖ ప్లేయర్లు ఫెరెంక్ పుష్కాస్, సాండూర్ కోక్సిస్, నాండోర్ హెడేగ్కుటి, జోసెఫ్ బోజిక్, గ్యూలా గ్రోసిస్స్‌లతో కూడిన వెస్ట్ జర్మనీ 1954 టోర్నమెంట్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 25 గోల్స్ సాధించి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది వెస్ట్ జర్మనీ. సెమీ ఫ్రొపెషనల్స్‌తోపాటు కోచ్ సెప్ప్ హర్బర్గర్ సాయంతో గ్రూపు దశలో హంగేరియా జట్టుపై 8 - 3 తేడాతో విజయం సాధించింది. కానీ వాంక్‌డార్ఫ్ స్టేడియం లోపల 60 వేల మంది వీక్షిస్తుండగా, మరోవైపు జోరున వర్షం కురుస్తుండగా జరిగిన ఫైనల్స్ టోర్నీలో హంగేరియా చేతిలో షాక్‌కు గురైంది. దీన్ని ‘మిరకిల్ ఆఫ్ బెర్న్’ అని అభివర్ణిస్తుంటారు. 

బ్రెజిల్‌తో క్వార్టర్ మ్యాచ్ హింసాత్మకం

ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ టోర్నీలో బ్రెజిల్ జట్టుపై జరిగిన మ్యాచ్ అత్యంత హింసాత్మక మ్యాచ్‌గా నిలిచింది. హంగేరియా వివాదాస్పదమైన పెనాల్టీ అవార్డుతో గోల్ సాధించి విజయం సాధించింది. కానీ రెండు జట్ల డ్రస్సింగ్ రూమ్‌ల్లో భారీగా ఘర్షణలు జరిగాయి. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టుపై హంగేరియా 4 - 2 స్కోర్ తేడాతో గెలుపొందింది. అంతేకాదు 16 జట్ల వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన చరిత్ర 1954 ప్రపంచ కప్ టోర్నీకే దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios