ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను ఇలాంటి స్థితిలో చూడటం చాలా బాధగా ఉందని ఆ జట్టు మాజీ కోచ్ మార్కెలో బిల్సా అన్నారు. అయితే తనకు స్టార్ ఆటగాడు మెస్సీ ఆటతీరుపై పూర్తి నమ్మకం ఉందని, అతడి సారథ్యంలో అర్జెంటినా జట్టు ఇకనుంచి జరిగే మ్చాచుల్లో రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుందని ఆయన తెలిపారు. 

ఫిపా వరల్డ్ కప్ 2018 లో ఇంతకు ముందు జరిగిన మ్యాచుల్లో అర్జెంటినా ఫేలవ ఆటతీరును కనబర్చిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగి వరుస వైఫల్యాలతో ఆ జట్టు సతమతమవుతోంది. ఈ సమయంలో ఆ జట్టుకు అండగా నిలిచారు బిల్సా. 

ఇప్పటి నుండి జరిగబోయే మ్యాచుల్లో అర్జెంటీనా తనదైన ఆటతీరుతో ఆడనుందని,  వారి బెస్ట్ ఆటతీరును చూస్తామని బిల్సా స్పష్టం చేశారు. తాను ఆ జట్టు ఆటగాళ్ల నైపుణ్యాన్ని నమ్ముతున్నట్లు,  మెస్సీ లీడర్ షిప్ పై తనకెంతో నమ్మకం ఉందని అన్నారు. అలాగని వన్ మ్యాన్ షో లా కాకుండా  జట్టంతా సమష్టిగా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే అర్జెంటినా జట్టు కోచింగ్  సిబ్బందిపై కూడా తనకెంతో విశ్వాసం ఉందని ఆయన తెలిపారు.వారు పట్టుదల, నైపుణ్యం తో జట్టుకు మంచి విజయాలను అందించడంతో తోడ్పడతారని అన్నారు.  కోచింగ్, ఇతర సిబ్బంది మరియు ఆటగాళ్లపై భారీగా నమ్మకాన్ని పెట్టుకున్నట్లు ఆయన వివరిచారు. ప్రపంచ కప్ లో తదుపరి జరిగే మ్యాచుల్లో మీరు కొత్త తరహా అర్జెంటీనా జట్టును చూస్తారని అన్నారు. మంచి ఆటతీరుతో ఫిపా వర్లల్డ్ కప్ లో అర్జెంటినా ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నట్లు బిల్సా తెలిపారు. 

"