Asianet News TeluguAsianet News Telugu

కావాలంటే ధోనీని పక్కనబెట్టొచ్చుగా.. కోహ్లీపై అభిమానుల ఫైర్

తొమ్మిది వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయం పాలవ్వడానికి తోడు.. 2-1తో సిరీస్ కోల్పోవడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

fans slams kohli decision

తొమ్మిది వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయం పాలవ్వడానికి తోడు.. 2-1తో సిరీస్ కోల్పోవడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మ్యాచ్ ఫలితం అనంతరం టీమిండియా క్రికెటర్లపైనా ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఫైరవుతున్నారు. ఆటగాళ్ల  ప్రదర్శనతో పాటు ముఖ్యంగా విరాట్ నిర్ణయాలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు..

రెండవ వన్డేలో దారుణ ఓటమితో.. కచ్చితంగా గెలవాల్సిన నిర్ణాయక  మ్యాచ్‌లో కోహ్లీ అన్ని రకాల అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగాలని.. బాగా ఆడని వారిని పక్కనబెట్టాలని నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగానే. రెండు వన్డేల్లో మిడిలార్డర్‌లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌కు బదులు దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నారు.. అయితే కార్తీక్ కీలక సమయంలో కెప్టెన్‌కు అండగా నిలిచి కుదురుకుంటున్న టైంలో చేజేతులా  వికెట్ పొగొట్టుకున్నాడు.

రాహుల్‌కు బదులుగా కార్తీక్‌ను తీసుకోవడం వల్లే మ్యాచ్‌లో ఓడిపోయామంటూ భారత అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. తొలి టీ20లో సెంచరీతో భారత్‌ను గెలిపించిన రాహుల్‌ను పక్కనబెట్టడం ఏంటని కొందరు.. రోహిత్‌కు చాలా అవకాశాలు ఇస్తారని.. రాహుల్‌కు మాత్రం ఛాన్స్‌లివ్వకుండా జట్టులోంచి తీసేస్తారని ఆరోపించారు... ఒకవేళ కార్తీక్‌కు అవకాశం ఇవ్వదలుచుకుంటే ధోనీని పక్కనబెట్టాలని.. మరికొందరు రైనాను  తీసేయ్యాలని అభిప్రాయపడుతున్నారు.

అయితే తన నిర్ణయంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందించాడు. వ్యూహాత్మక మార్పులో భాగంగానే దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇచ్చామని... జట్టుకు మిడిల్ ఓవర్స్‌లో సమర్థవంతంగా ఆడే బ్యాట్స్‌మెన్ కావాలని... అందుకే ఆ స్థానంలో కార్తీక్‌ను తీసుకున్నట్లు విరాట్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios