హైదరాబాద్: నిన్నా మొన్నటి దాకా ఇంగ్లండ్ పాలిట శాపాలుగా మారిన పెనాల్టీలు మంగళవారం కొలంబియాపై ఆడిన మ్యాచ్‌లో వరదాయినిగా మారాయి. 4-3 గోల్స్ తేడాతో కొలంబియాపై విజయాన్ని కట్టబెట్టాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్త్ సంపాదించిపెట్టాయి. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హ్యారీ కేన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్వీడన్‌పై క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్ ఆడడానికి ఇంగ్లండ్ జట్టు రంగం సిద్ధం చేసుకుంటున్నది. 

మూడు ప్రపంచకప్ షూట్ అవుట్‌లు, యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో నాలుగింట మూడు షూట్ అవుట్‌లను కోల్పోయిన విషాదభరితమైన చరిత్రను కలిగి ఉన్న ఇంగ్లండ్.. మంగళవారం మాచుస్ ఉరేబ్, కార్లోస్ బక్కా వైఫల్యం మధ్య ఎరిక్ డీర్ చేసిన నిర్ణయాత్మకమైన కిక్ గోల్‌గా మారింది. ఇంగ్లండ్‌ను గెలిపించింది.
 
కొలంబియా విషయానికి వస్తే.. ప్రపంచకప్ షూట్ అవుట్‌లో పాలుపంచుకోవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. అలాగని ఆషామాషీగా ఆడలేదు. జోర్డాన్ హెండెర్‌సన్ తన స్పాట్ కిక్ మిస్ చేసుకోవడంలో విజయవంతమైంది. 

అంతకుముందు హ్యారీ కేన్ టోర్నమెంట్‌లో ఆరవ గోల్ అన్నట్టుగా 57వ నిముషం పెనాల్టీలో గోల్ చేశాడు. 2006 తర్వాత నాకౌట్ గేమ్‌లో గెలుపొందడం ఇంగ్లండ్‌కు ఇదే తొలిసారి.