Asianet News TeluguAsianet News Telugu

మెస్సీ భ భ.. భయపడ్డడా?

మెస్సీ భ భ.. భయపడ్డడా?

did messy frighted

హైదరాబాద్: కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న తీరుగా మారింది అర్జెంటీనా సూపర్ స్టార్ లియెనెల్ మెస్సీ పరిస్థితి. ఇజ్రాయెల్‌, అర్జెంటీనా మద్య జరగాల్సిన వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి మెస్సీలో పుట్టుకొచ్చిన భయమే కారణమనే మాట సాకర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌లో అడుగుపెడితే ప్రేయర్స్‌ను, వారి కుటుంబాలను నామరూపాల్లేకుండా చేస్తామంటూ పాలస్తీనా క్రియేట్ చేసిన 'ఫుట్‌బాల్ టెర్రర్'కు మెస్సీ అండ్ టీమ్ భయపడిపోవడంతో మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి దారి తీసిందని ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి రొటెమ్ కమెర్ విమర్శించాడు. దీన్ని తాము సహించేది లేదని, ఫిఫా‌కు కంప్లయింట్ చేస్తామని హెచ్చరించాడు. 
అయితే తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదిరినట్టుగా ఇజ్రాయెల్ కంప్లయింట్‌కు తాము భయపడేది లేదని పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిబ్రిల్ రాజోబ్ అన్నాడు. తమను ఉద్దేశించి ఫుట్‌బాల్ టెర్రర్ అన్న మాట వాడినందుకు పడీపడీ నవ్వాడు. ఇజ్రాయెల్‌తో వామప్ మ్యాచ్ వెనుక రాజకీయ దురుద్దేశ్యం ఉంది కాబట్టే ఆడటానికి అర్జెంటీనా వెనక్కి తగ్గిందని రాజోబ్ తేల్చి చెప్పాడు. ఇదే సందర్భంగా మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నందుకు మెస్సీ అండ్ టీమ్ ‌కు థ్యాంక్స్ కూడా చెప్పాడు.

అసలు మ్యాచ్ వేదికను జెరుసలేమ్‌కు మార్చడం వల్లనే లేనిపోని అంతర్జాతీయ వివాదంలోకి తన ప్రమేయం లేకుండానే లియెనెల్ మెస్సీ పేరు లాగబడిందని ఫుట్‌బాల్ విశ్లేషకులు అంటున్నారు. ముందుగా అనుకున్నట్టు హైఫా సిటీనే ఖరారు చేసుకొని ఉన్నట్టయితే మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేది కాదు.. వరల్డ్ కప్‌కు ముందు మెస్సీకి ఇంత టెన్షన్ ఉండేది కాదని వారు తేల్చి చెబుతున్నారు. 

వేదిక మార్పునకు ప్రధాన సూత్రధారి అయిన ఇజ్రాయెల్ క్రీడల మంత్రి మిరి రెగెవ్‌ను మెస్సీ ఫ్యాన్స్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వరల్డ్ కప్‌కు ముందు ఈ లొల్లి ఏంటని మండిపడుతున్నారు. పనిలోపనిగా దీనంతటికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తున్నారు.
ట్రంప్‌కు ఇప్పటి గొడవకు ఏంటయ్యా సంబంధం అంటే.. ఆది నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా వివాద కేంద్రంగా జెరుసలేమ్ ఉంటూ వస్తున్నది. ఆజ్యంతో అగ్గి రాజేసినట్టుగా ట్రంప్ పోయిన డిసెంబర్‌లో ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలేమ్‌ను ప్రకటించాడు. అంతటి ఆగకుండా ఇజ్రాయెల్ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికా తన ఇజ్రాయెల్ ఏంబసీని మే నెలలో జెరుసలెమ్‌కు మార్చింది. అట్టహాసంగా వేడుక చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios