Asianet News TeluguAsianet News Telugu

ధోనీ షార్ట్ రన్ గుట్టు విప్పిన ఆడమ్ గిల్ క్రిస్ట్

తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్‌ విజయకాశాలను  దెబ్బ తీసింది. రెండో వన్డేలో మాత్రం అది కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

Dhoni short run: Umpire ignores
Author
Adelaide SA, First Published Jan 17, 2019, 8:57 AM IST

అడిలైడ్‌: ఆస్ట్రేలియాపై జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన తప్పును కనిపెట్టడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమయ్యారు.  ఆస్ట్రేలియాతో భారత్‌ జరిగిన తొలి వన్డేలో ధోని వికెట్‌ విషయంలో అంపైర్లు చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది. తాజాగా, మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరోసారి తప్పులో కాలేశారు. 

తొలి వన్డేలో చేసిన తప్పిదం భారత్‌ విజయకాశాలను  దెబ్బ తీసింది. రెండో వన్డేలో మాత్రం అది కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ, ధోని అద్భుత ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

అయితే ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ లయన్‌ వేసిన 45వ ఓవర్‌లో ధోని షార్ట్‌ రన్‌తీశాడు. అంటే పరుగే తీయలేదు. దీన్ని అంపైర్లు గుర్తించలేదు. కనీసం ఆసీస్‌ ఆటగాళ్లు కూడా గుర్తించలేదు ఈ విషయాన్ని ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ బయటపెట్టాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సిరీస్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గిల్‌క్రిస్ట్ ఆ విషయాన్ని వెల్లడించాడు. అంపైర్లు ధోని షార్ట్‌ రన్‌ను గుర్తిస్తే భారత్‌ గెలుపుపై ప్రభావం చూపేదని అభిప్రాయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్

ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

Follow Us:
Download App:
  • android
  • ios