మైదానంలో ధోనీ కూతురు హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో

First Published 21, May 2018, 12:38 PM IST
Dhoni playing with his daughter video going viral
Highlights

మైదానంలో ధోనీ కూతురు హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో

ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో సోషల్‌మీడియాలో ఎక్కువ హంగామా చేసింది ధోనీ కూతురు జీవా. తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన మరో వీడియో బయటకువచ్చింది. ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమం జరుగుతోన్న సమయంలో మైదానంలో ఆసక్తికరమైన ఓ సన్నివేశం. ధోనీ తన కూతురు జీవాతో కలిసి సరదాగా ఆడుకుంటూ కనిపించాడు. ధోనీ తలపైనున్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది. జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది. మరి ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.

 

loader