మహేంద్రసింగ్ ధోనీ... భారత క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ఎంత ఒత్తిడిలోనైనా సంయమనం కోల్పోకుండా ఆడటంతో పాటు అంతే ఒత్తిడిలోనూ వ్యూహాలు రచిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ధోని సిద్ధహస్తుడు.

మేనేజ్‌మెంట్ విద్యార్థులకు సైతం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి తెలియాలంటూ ధోని ఆటను చూడాలని ప్రొఫెసర్లు చెప్పారంటే మిస్టర్ కూల్ ఎంత కూల్‌గా ఉంటాడో చెప్పక్కర్లేదు. అలాంటి ధోనికి కోపం వచ్చింది. టీమిండియా యువ క్రికెటర్ ఖలీల్ అహ్మద్‌పై మహేంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ధోనీ, దినేశ్ కార్తీక్‌లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంపైర్లు డ్రింక్స్ విరామం ప్రకటించారు. 12వ ఆటగాడు ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడు చహల్‌లు డ్రింక్స్ ఇవ్వడానికి గ్రౌండ్‌లోకి వచ్చారు.

అయితే ఆ సమయంలో ఖలీల్ పిచ్‌పై పరిగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. పట్టరాని కోపంతో ఎక్కడ నడుస్తున్నావ్..? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో పాటు ధోనీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడుకావడంతో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది.

అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్

ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

జడేజా షార్ప్ త్రో చూశారా: ఖవాజాకు షాక్

ఆసీస్ పై భారత్ విజయం: ధోనీయే ఫినిషర్, సిరీస్ సమం

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్ శర్మ