పెరూ వీక్.. డెన్మార్క్ విన్

Denmark win match against Peru
Highlights

పెరూ వీక్.. డెన్మార్క్ విన్

హైదరాబాద్: యూసుఫ్ పాల్సన్ చేసిన ఏకైక గోల్ 30 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు వచ్చిన పెరూపై డెన్మార్క్ గెలుపొందడానికి కారణమైంది. 1-0 స్కోరుతో డెన్మార్క్ విజేతగా నిలిచింది. బలహీనంగా ఉన్నప్పటికీ, శనివారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పెరూ చేసిన పోరాటం ప్రేక్షకులను కట్టిపడేసింది.టోటెన్హామ్, క్రిస్టియస్ ఎరిక్సన్ లాంటి హేమాహేమాలతో వీరంగం ఆడుతున్న డెన్మార్క్‌కు పెరూ గట్టి పోటీ ఇచ్చిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.  


ఇంతటి ఉత్కంఠభరిమైన పోరులో ఫస్టాఫ్ ముగిసే సమయానికి మ్యాచ్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. సెకండాఫ్‌లో యుసుఫ్ పాల్సన్ 59వ నిముషంలో గోల్ చేసి డెన్మార్క్‌కు ఆధిక్యతను కట్టబెట్టాడు. సెకండాఫ్ అంతా ఇరు జట్ల మధ్య హోరాహోరీతో పోరుతోనే ముగిసింది. డెన్మార్క్‌ను విజేతను చేసింది. యూసఫ్ పాల్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

loader