ఐపీఎల్ ఫైనల్ ఓటమిపాలై ట్రోపిని అందుకోలేకపోయామని బాధపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ సారథి వార్నర్ అండగా నిలిచారు.తమ జట్టు ఓడిపోవడంపై వార్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జట్టు ఒక్క ఫైనల్ లో ఓడినంత మాత్రాన నిరాశ చెందవద్దని మొత్తం టోర్నమెంట్ లో చూపిన అద్భుత ప్రదర్శనకు గర్వపడాలని వార్నర్ సూచించారు.  

ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వాట్సన్ ను వార్నర్ ప్రశంసించాడు. షేన్ వాట్సన్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని అన్నారు. నిజంగా అతడి బ్యాటింగ్ స్టైల్ అద్భుతమని.. అతడి వీరోచిత ఇన్నింగ్స్ చూడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.