రష్యా! ఓ రష్యా! ఓడిపోయావా రష్యా..!

ఈసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరింది. అంతే నివ్వెరపాటుకు గురి చేస్తూ ఓటమిపాలైంది

Croatia beat Russia

ఆది నుంచి పోరాటం.. కప్ గెలుచుకోవాలని అంతులేని పోరాటం.. ఇది హోస్ట్ టీమ్ రష్యా ఆట తీరు. కానీ సెమీ ఫైనల్స్‌కు చేరుకోవాలనుకున్న రష్యా ఆశలపై పెనాల్టీలు నీరుగార్చాయి. శనివారం 2-2 తో డ్రాగా ముగుస్తుందనుకున్న  గేమ్ కాస్త షూట్ అవుట్‌తో 4-3 తేడాతో క్రొయేషియా‌కు విన్నింగ్ గేమ్ అయ్యింది. లూకా మాడ్రిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టోర్నీ నుంచి రష్యా నిష్క్రమణం.. సెమీ ఫైనల్స్‌కు క్రొయేషియా పయనం ఏకకాలంలో జరిగాయి. ఈసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్యా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ క్వార్టర్ ఫైనల్స్ దాకా చేరింది. అంతే నివ్వెరపాటుకు గురి చేస్తూ ఓటమిపాలైంది. నువ్వా నేనా అంటూ సాగిన గేమ్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్‌ అయ్యింది.
 
క్వార్టర్ ఫైనల్స్‌లో క్రొయేషియాను ఢీకొట్టడానికి గ్రౌండ్‌లోకి రష్యా టీమ్ అడుగుపెట్టగానే గ్యాలరీ అంతటా కరతాళ ధ్వనులతో నల్ల సముద్రపు అలల హోరును తలపించింది. గత గేమ్‌లో స్పెయిన్‌ను మట్టి కరిపించిన తమ సొంత జట్టు అదే తరహాలో క్రొయేషియాను ఇంటికి సాగనంపి, సెమీ ఫైనల్స్‌‌కు ఎంట్రీ ఇస్తుందనే ఉత్సాహం రష్యన్లలో కనిపించింది. అదే జరిగితే కప్ కొట్టేయ్యడం పెద్ద విషయం కాదన్న ధీమా వారి ముఖాల్లో కనిపించింది. 

కానీ నాటకీయమైన 2-2 డ్రా అనంతరం షూట్ అవుట్‌లో ఇవాన్ రకిటిక్ గెలుపు పెనాల్టీ సాధించడంతో క్రొయేషియా 4-3 తేడాతో రష్యాను ఓడించింది. అంతకుమునుపు 115వ నిముషం వద్ద మరియో ఫెర్నాండేజ్ గోల్ చేసి 2-2 తో స్కోరు సమం చేశాడు. దాంతో పెనాల్టీల అవసరం పడింది.

కానీ మరియో, మరో రష్యన్ ప్లేయర్ ఫెడొర్ స్మొలోవ్ స్పాట్ కిక్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. క్రొయేషియా తరఫున అండ్రేజ్ క్రామరిక్, డొమగోజ్ విడా ఆట తీరు ఆ టీమ్‌ను సెమీ ఫైనల్స్ బాట పట్టించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios