తండ్రికి మాంచి కిక్ ఇచ్చే గోల్ (వీడియో)

Cristiano Ronaldo's son Skills & Amazing goal after Portugal vs Algeria match
Highlights

మైదానంలోకి దిగిన జూనియర్ రోనాల్డో.. చురుగ్గా కదులుతూ..

క్రిస్టియానో రోనాల్డో ..  పొర్చుగల్‌కు చెందిన ఈ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు  ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇతనిని చూడటానికే జనం ఫుట్‌బాల్ స్టేడియాలకు తరలివస్తారంటే అతిశయోక్తి కాదు.. అలాంటి క్రిస్టియానో తన వారసుడిని తన స్థాయిలో స్టార్ ప్లేయర్‌గా చేయాలని కలలు కంటున్నాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియానో కూడా ఫుట్‌బాల్‌కు సంబంధించిన మెలకువలను తన కొడుక్కి నేర్పిస్తున్నాడు. వీటిని ఆ పిల్లాడు అనుసరిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటాడు. అల్జీరియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మైదానంలోకి దిగిన జూనియర్ రోనాల్డో.. చురుగ్గా కదులుతూ.. కుడివైపు టైప్ కార్నర్ మీదుగా గోల్ కొట్టడంతో గ్యాలరీలో కూర్చొన్న వారంతా కేకలు వేశారు. ఈ కుర్రాడు తండ్రికి ఏ మాత్రం తగ్గడం లేదే అంటూ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

loader