పెళ్లి పీటలు ఎక్కనున్న హారిక.. వరుడు ఎవరంటే..

Chess Champion Dronavalli Harika Marriage Updates
Highlights

ఈ నెల 18న నిశ్చితార్థం

 గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్న బిజినెస్ మ్యాన్ కార్తీక్‌ చంద్రను ఆగస్టు 19వ తేదీన వివాహం చేసుకోనుంది. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 18న హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌లో జరగనుంది.


హారిక విషయానికి వస్తే 1991 జనవరి 12న గుంటూరులో జన్మించింది. చిన్నప్పటి నుంచే చెస్‌పై ఇష్టం పెంచుకున్న హారిక అండర్‌-9 నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. ఆ తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. కోనేరు హంపి తర్వాత గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను పొందిన రెండో మహిళా క్రీడాకారిణి.

ద్రోణవల్లి హారిక ఇప్పటివరకు సాధించిన పతకాలు:
* గత ఏడాది ఇరాన్‌లో జరిగిన వరల్డ్ ఉమెన్స్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో హారిక కాంస్య పతకం గెలిచింది.

* 2015లో ప్రపంచ మహిళల ఆన్‌లైన్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది.

* 2016లో చైనాలో నిర్వహించిన ఫిడే ఉమెన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.


* యూఏఈలో నిర్వహించిన ఉమెన్ ఆసియా టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత ర్యాపిడ్‌ విభాగంలో స్వర్ణం పతకం దక్కించుకుంది.

loader