Asianet News TeluguAsianet News Telugu

సెర్బియాను చిత్తుచేసిన బ్రెజిల్, విజృంబించిన నెయ్ మార్ (వీడియో)

2-0 తేడాతో విజయం...

Brazil into knockouts with win over Serbia

నాకౌట్ కు చేరాలంటే తప్పకుడా గెలవాల్సిన మ్యాచ్ లో బ్రెజిల్ జట్టు విజృంబించింది. గ్రూప్ ఈ లో సెర్బియాతో తలపడ్డ ఈ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. బ్రెజిల్ 2-0 తేడాతో సెర్జియాను ఓడించింది.

ఫిఫా పుట్ బాల్ వరల్డ్ కప్ 2018 లో బ్రెజిల్ జట్టు హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అయితే ఆ జట్టు అంత సులభంగా నాకౌట్‌కు చేరలేకపోయింది. చివరికి లీగ్‌ చివరి మ్యాచ్‌లో గెలిస్తే తప్ప నాకౌట్ కు చేరలేని పరిస్థికి వచ్చింది. అయితే ఎలాగైతేనేం చివరికి సెర్బియాను ఓడించి నాకౌట్ కు చేరింది. 

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు స్టార్‌ ప్లేయర్ నెయ్ మార్‌ తన సత్తా చాటారు. అయితే జట్టంతా అతడిమీదే ఆధారపడకుండా సమిష్టిగా రాణించింది. తొలి అర్ధబాగంలో పాలిన్హో హెడర్‌ గోల్‌ చేసి బ్రెజిల్‌ జట్టుకు తొలి గోల్‌ అందిచాడు.  ఆ తర్వాత 68వ నిమిషంలో టి సిల్వా మరో గోల్‌ చేసి జట్టుకు మరింత ఆధిక్యాన్ని పెంచాడు. దీంతో బ్రెజిల్ 2-0 ఆధిక్యంతో సెర్బియాను ఓడించి నాకౌట్ కు చేరింది.  

"

 

Follow Us:
Download App:
  • android
  • ios