Asianet News TeluguAsianet News Telugu

జర్మనీ హ్యాట్రిక్ " గోల్స్ " వీరులు (వీడియో)

నరాలు తెగె ఉత్కంఠ

BNA Germany hattrick heroes

నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగే ఫిఫా వరల్డ్ కప్‌లో ఒక గోల్ కూడా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. ఆ ఒక్క గోల్ కొట్టడానికి జట్టులోని ప్రతి ఆటగాడు..ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడు.. అలాగే ప్రత్యర్థి జట్టు కూడా అందుకు ఛాన్స్ ఇవ్వదు.. ఇలాంటి చోటు ఒక్క ఆటగాడే మూడు గోల్స్ (హ్యాట్రిక్గోల్స్) కొడితే.. ఈ అరుదైన ఫీట్‌ను ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో చాలా మంది అందుకున్నారు. అలాంటి వాటిలో జర్మనీకి చెందిన వారిని ఒకసారి పరిశీలిస్తే.. మొత్తం ఏడు సార్లు ఆ దేశం ఈ ఘనతను అందుకుంది..

జర్మనీ ఏకీకరణకు పూర్వం ఎడ్మండ్ కానిన్, మాక్స్ మోర్లాక్, జెర్డ్ ముల్లర్, జెర్డ్ ముల్లర్-2, హర్ల్ హెయింజ్ రుమ్మింగ్, మిర్లోసావ్ క్లోజ్, థామస్ ముల్లర్ మూడు సార్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. వీటిలో 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌ జర్మన్లకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన ఏకైక జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో తామే మొదటి గోల్ చేయడం జర్మనీకి ఇది 60వ సారి.. తద్వారా బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో ముల్లర్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడంతో.. ఫిలిప్ లామ్ నాయకత్వంలోని జర్మనీ 4-0 తేడాతో పోర్చుగల్‌ను చిత్తు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios