Asianet News TeluguAsianet News Telugu

గోల్సే గోల్సు.. నాకౌట్‌కు బెల్జియం

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  ఎడెన్ హజార్డ్

Belgium crush Tunisia

హైదరాబాద్: బెల్జియం నుంచి వెల్లువెత్తిన గోల్స్ వర్షానికి ట్యునీషియా శనివారం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. హజార్డ్, లుకాకు చెరి రెండేసి గోల్స్ చేసి బెల్జియం విషయానికి కారణమయ్యారు. ఆది నుంచి తనదైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చిన బెల్జియం 5-2 గోల్స్‌తో ట్యునీషియాపై విజయం సాధించింది. నాకౌట్‌కు చేరుకుంది. అంతటితో ఆగకుండా ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్ ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే అంటే 5.59 నిముషాల్లోనే గోల్ చేసిన రెండో జట్టుగా పేరు గడించింది. 
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎడెన్ హజార్డ్ నిలిచాడు.


మ్యాచ్ మొదట్లోనే బెల్జియం మిడ్ ఫీల్డర్ ఎడెన్ హజార్డ్ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత స్ట్రయికర్ రొమెలు లుకాకు 16వ నిముషంలో గోల్ చేయడం ద్వారా జట్టుకు 2-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఇంజూరీ టైమ్‌లో లుకాకు మరో గోల్ చేసి ట్యునీషియాను మరింత కష్టాల్లోకి నెట్టివేశాడు. ట్యునీషియా తరఫున డైలాన్ బ్రోన్ 18వ నిముషంలో తొలి గోల్ చేశాడు.


సెకండాఫ్‌కు వచ్చేసరికి 51వ నిముషంలో ఎడెన్ హజార్డ్ మరో గోల్ చేసి జట్టు ఆధిక్యతను పెంచాడు. ఈ మ్యాచ్‌లో హజార్డ్, లుకాకులు రెండేసి గోల్స్‌తో రెచ్చిపోయి ఆడారు. 90వ నిముషంలో బెల్జియం ఆటగాడు మిచ్చీ గోల్ చేయడంతో ట్యునీషియా కథ ముగిసిపోయింది. ఇంజూరీ టైమ్‌లో అంటే 93వ నిముషంలో ట్యునీషియా స్ట్రయికర్ ఖాజ్రీ గోల్ చేయడంతో 2-5 గోల్స్ తేడాతో బెల్జియం గెలుపొందింది.

Follow Us:
Download App:
  • android
  • ios