ఆసియాకప్-2018 కైవసం చేసుకొన్న బంగ్లా: 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి

Bangladesh beat India by 3 wickets to clinch Women’s Asia Cup
Highlights

భారత్‌కు చుక్కలు చూపిన బంగ్లా


కౌలాలంపూర్:  ఆసియాకప్ 2018 ఫైనల్లో ఇండియాను బంగ్లా జట్టు మట్టికరిపించింది. మూడు వికెట్ల తేడాతో ఆసియాకప్ ఫైనల్లో మహిళల జట్టను బంగ్లాదేశ్ టీమ్ ఓడించింది. ఆసియాకప్ ను బంగ్లా కైవసం చేసుకొంది. మహిళల టీ 20 ఆసియాకప్ 2018 ఫైనల్లో ఇండియాకు బంగ్లాదేశ్ చుక్కలు చూపించింది.

వరుసగా ఆరు టోర్నీల టైటిళ్ళను నెగ్గిన భారత్ కు  ఈ దఫా బంగ్లాదేశ్ నుండి ఎదురుదెబ్బ తగిలింది.  తొలిసారిగా బంగ్లాదేశ్ ఆసియాకప్ ను కైవసం చేసుకొంది.

టాస్ గెలిచి  బ్యాటింగ్ కు దిగిన భారత్ 113 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే బంగ్లా ముందు ఉంచింది. భారత్ బ్యాట్స్ఉమెన్ లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మినహా ఎవరూ కూడ రాణించలేదు. స్మృతీ మంధాన  ఏడు పరుగులకే పెవిలియన్ కు చేరుకొంది. దీప్తి శర్మ నాలుగు పరుగులకే , మిథాలీరాజ్ 11 పరుగులు మాత్రమే చేసింది.

అయితే భారత్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో తొలుత కాస్త తడబాటును బంగ్లా జట్టు సభ్యులు ప్రదర్శించారు. ఓపెనర్లు షమిమా సుల్తానా 16 పరుగులు, ఆయేషా రెహ్మాన్ లు బంగ్లాకు మంచి శుభాన్ని ఇచ్చారు. కానీ, వారిద్దరూ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు.

బంగ్లాకు చెందిన బ్యాట్స్ ఉమెన్ రుమాన్ అహ్మద్ 23 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. అయితే చివరి ఓవర్లో విజయం రెండు జట్ల మధ్య ఊగిసలాడింది. అయితే చివరి బంతికి  రెండు పరుగులు తీసిన బంగ్లా జట్టు భారత్ పై విజయం సాధించింది.

loader