బ్యాటింగ్ ఆరంభించిన అప్ఘాన్...
బెంగళూరు లో అప్ఘాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత జట్టు 474 పరుగుల వద్ద ఆలౌటైంది. నిన్న ఓపెనర్లు దాటిగా బ్యాటింగ్ చేసి సెంచరీలు సాధించడంతో ఆరంభంలోనే గట్టి పునాది పడింది.అయితే మిగతా ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారెవరూ ఆ స్థాయిలో రాణించలేదు. దీంతో భారత జట్టు బారీ స్కోరు సాధించలేకపోయింది. మొత్తంగా నిన్న, ఇవాళ కలిపి 104.5 ఓవర్లాడిన భారత జట్టు 474 పరుగులు సాధించింది.
ఇవాళ 347/6 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీం ఇండియా మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాడు అశ్విన్(7) త్వరగా ఔటైనా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మంచి ఇన్నింగ్స్ ను నిర్మించారు. బాగా పరుగులు సాధిస్తున్న హర్దిక్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ జడేజా సహకారం అందించాడు. ఇలా హార్దిక్ పాండ్యా 83 బంతుల్లో అర్థశతకం సాధించాడు.
436 పరుగుల వద్ద జడేజా 8 వ వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో ఈ బాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడటంతో 474 వద్ద భారత జట్టు ఆలౌటైంది. చివర్లో ఉమేష్ యాదవ్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 21 బంతుల్లోనే 26 (2 ఫోర్లు, 2 సిక్స్ )పరుగులు సాధించి నాటౌట్ గానిలిచాడు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో యమీన్ అహ్మద్‌జాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇతడు మూడు వికెట్లతో భారత జట్టును భారీ స్కోరు చేయకుండా కట్టడిచేయగలిగాడు. ఇక మిగతా బౌలర్లు వఫాదార్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీశారు.
