తండ్రి పోలికలే కాదు.. సెంటిమెంట్ కూడా ..? తొలి మ్యాచ్‌లో సచిన్‌లాగే.. అర్జున్ డకౌట్

arjun tendulkar duckout in first match
Highlights

కొందరు కొడుకులు తండ్రి నుంచి పట్టుదల, మొండితనం, ధైర్యం, ఆస్తులు వారసత్వంగా పొందుతారు. కానీ జీవితంలో తండ్రికి జరిగిన అనుభవాలే కొడుకు దక్కడం అరుదనే చెప్పవచ్చు

కొందరు కొడుకులు తండ్రి నుంచి పట్టుదల, మొండితనం, ధైర్యం, ఆస్తులు వారసత్వంగా పొందుతారు. కానీ జీవితంలో తండ్రికి జరిగిన అనుభవాలే కొడుకు దక్కడం అరుదనే చెప్పవచ్చు.. ఇలాంటి అరుదైన అదృష్టాన్ని పొందాడు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. క్రికెట్ దేవుడిగా, రికార్డుల రారాజుగా నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్ తన తొలి వన్డే మ్యాచ్‌లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే.

1989లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ పరుగులేమి సాధించకుండానే పెవిలియన్ చేరాడు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ అండర్ 19 జట్టులో స్థానం సంపాదించాడు. శ్రీలంకతో జరిగిన తన తొలి టెస్టులో అర్జున్ డకౌట్ అయ్యాడు.

తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జూనియర్ టెండూల్కర్ 11 బంతులు ఆడి.. కపిల్ మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. సచిన్‌కు అలాగే జరిగి ఆ తర్వాత దిగ్గజ క్రికెటర్‌గా మారడంతో.. అర్జున్ కూడా స్టార్ క్రికెటర్ అవుతాడని టెండూల్కర్ అభిమానులు అంటున్నారు.
 

loader