1978 సాకర్ టోర్నీ ఇలా వివాదాస్పదం: ఆతిథ్య అర్జెంటీనా ఆధిపత్యం

Argentina team leading
Highlights

1978 సాకర్ టోర్నీ ఇలా వివాదాస్పదం

 

హైదరాబాద్: ఫీల్డ్, అన్ పీల్డ్‌లో వివాదాలకు నిలయం సాకర్ కప్. తొలిసారి 1978లో అర్జెంటీనాలో ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 1976లో అర్జెంటీనాలో సైన్యం కుట్ర పన్నినప్పుడు  ఆ దేశ అధ్యక్షుడు జనరల్ జార్జి రాఫెల్ వెదిలా.. టోర్నమెంట్‌ నిర్వహణ తమకు దక్కడం జాతి గర్వ కారణమని పేర్కొన్నారు. అంతేకాదు వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకు రావాలని జట్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని ఆంక్షలు పెట్టారు. దీంతో నెదర్లాండ్స్ జట్టుపై జరిగిన ఫైనల్స్‌లో 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించారు.

సాకర్ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే నిర్వాహక కమిటీ చైర్మన్ హత్య

1976లో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు క్రీడల నిర్వాహక కమిటీ చైర్మన్ జనరల్ ఒమర్ ఆక్టిస్ హత్యకు గురయ్యాడు. ఇక నిషేధిత పదార్థాలు వాడినందుకు స్కాట్లాండ్‌కు చెందిన ఆటగాడు జాన్స్‌టన్ ఇంటికి పంపేశారు. 

బ్రెజిల్ రెండో రౌండ్ దాటినా ఫైనల్స్‌కు నో చాన్స్


ఆస్ట్రియా జట్టును దాటుకుని బ్రెజిల్ సెకండ్ రౌండ్‌కు చేరుకున్నా గానీ ఆ జట్టును ఫైనల్ పోరుకు వెళ్లేందుకు అర్జెంటీనా అనుమతించలేదు. పెరూతో జరిగే బ్రెజిల్ జట్టు మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా అర్జెంటీనా జాప్యమయ్యేలా చేసింది. తద్వారా పెరూ జట్టుతో జరిగే మ్యాచ్‌లో గెలుపొందితే బ్రెజిల్ జట్టు నాడు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. 

జుంటా బెదిరింపులతో పెరూ ఇలా ఓటమి

నాడు పోలండ్ టీమ్‌తో బ్రెజిల్ 3 - 1 స్కోర్‌తో విజయం సాధించింది. పెరూ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీం అర్జెంటీనా టీం 6 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. దీనికి కారణమేమిటంటే జుంటా బెదిరింపులకు గురైన ఆటగాళ్లు కొందరు ఉంటే, ముడుపులు స్వీకరించిన వారు కొందరు ఉండటంతోనే పెరూ ఓటమి పాలైంది.

కప్ కోసం అర్జెంటీనా ఇష్టారాజ్యం

గాయపడిన డచ్ ప్లేయర్ రెనెవాన్ డీ కెర్ఖోఫ్ అర్జెంటీనాల నుంచి నిరసన వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ వదులుకున్న టైటిల్ పోరులో అర్జెంటీనా తలపడింది. నాడు అర్జెంటీనా జట్టులో ఆడిన విదేశీ ఆటగాడు మారియో కెంపెస్ జట్టు లీడ్ సాధించాడు. నాడు మ్యాచ్ మొదలైన ఎనిమిది నిమిషాలకే నెదర్లాండ్స్‌ను పక్కకు నెట్టివేసే ప్రయత్నం జరిగింది. ఎక్స్ ట్రా టైంలో రాబ్ రెంసెంబ్రిక్ సాధించిన గోల్‌తో టోర్నీలో విజయం సాధించినా ఆతిథ్య జట్టు అర్జెంటీనా వరల్డ్ కప్ టైటిల్ ఇవ్వ నిరాకరించింది. ఆఖరికి 17 ఏళ్ల కుర్రాడు సీజర్ మెనొట్టి ఆధ్వర్యంలో అర్జెంటీనా టైటిల్ గెలుచుకున్నా కోచ్‌గా యువకుడిగా.. గోల్స్ చేయగల సామర్థ్యం గల డియాగో ఆర్మాండో మారడోనా వల్లే ఇది సాధ్యమైందన్నాడు.

loader