Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల కెరీర్‌లో కుక్ తీసిన ఏకైక వికెట్ ఎవరిదో తెలుసా..?

ఇంగ్లాండ్ స్లార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు.

Alastair Cook bowling gets his first Test Wicket
Author
England, First Published Sep 4, 2018, 1:25 PM IST

ఇంగ్లాండ్ స్లార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడంటే ఎలాంటి బౌలర్‌కైనా కొరకరాని కొయ్యగా మారుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం కుక్ స్పెషాలిటీ. అలాంటి కుక్‌లో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. కానీ ఇన్నేళ్ల కెరీర్‌లో అలిస్టర్ కేవలం మూడు ఓవర్లే బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. అది కూడా మన బౌలర్ ఇషాంత్ శర్మదే.

2014లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా వికెట్లు చివరి వరుస బ్యాట్స్‌మెన్ భువనేశ్వర్-ఇషాంత్ శర్మలు ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. దీంతో ఈ జోడీని విడదీయడానికి అప్పటి కెప్టెన్ అలిస్టర్ కుక్ స్వయంగా బంతిని అందుకున్నాడు. విభిన్నమైన శైలితో బంతులు వేసిన కుక్ ఎట్టకేలకు ఇషాంత్‌ను పెవిలియన్‌కు పంపించాడు

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి: 

అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్ వీడ్కోలు

ఇంగ్లాండ్ అల్ టైమ్ గ్రేట్.. రికార్డులు రారాజు "కుక్"

ఇండియాతోనే చివరిగా: అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు ఆటగాడిగా

Follow Us:
Download App:
  • android
  • ios