ఇంగ్లాండ్  స్టార్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రిటైర్‌మెంట్ అతని అభిమానులను, క్రికెట్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ వరుసగా విఫలమవుతుండటంతో.. రిటైర్‌మెంట్ ప్రకటించి వుండవచ్చని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే యాదృచ్ఛికమో లేక మరోకటో ఇండియాతో ఆడినప్పుడే అతని క్రీడాజీవితంలో మార్పులు సంభవిస్తున్నాయి.

2017 కుక్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. అప్పుడు 0-4తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దారుణ ఓటమితో మాజీ క్రికెటర్లు, ఇంగ్లీష్ అభిమానులు కుక్ కెప్టెన్సీపై విమర్శలు కురిపించారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన కుక్.. తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు.

ఇక తాజాగా భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తేడాతో ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. కుక్ తన స్థాయికి తగ్గ ఆట ఇంతవరకు ఆడలేదు. దీంతో అతనిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు కుక్ ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని జీవితంలోని రెండు కీలక ఘట్టాలు ఇండియాతో ముడిపడి ఉండటం ఆశ్చర్యకరం.

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్ వీడ్కోలు

ఇంగ్లాండ్ అల్ టైమ్ గ్రేట్.. రికార్డులు రారాజు "కుక్"