అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ వీడ్కోలు పలికాడు.. ఈ నెల 7వ తేదీన భారత్‌తో  జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ వీడ్కోలు పలికాడు.. ఈ నెల 7వ తేదీన భారత్‌తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా కుక్ చరిత్ర లిఖించాడు.

రెండు దశాబ్ధాలకు పైగా క్రికెట్ ఆడిన కుక్ తన క్రీడా జీవితంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.. అత్యంత పిన్న వయస్సులో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కుక్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ 31 ఏళ్ల 326 రోజుల వద్ద ఈ మైలురాయిని బద్ధలు కొడితే.. కుక్ 31 సంవత్సరాల 157 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు అతనే. 

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

ఇంగ్లాండ్ అల్ టైమ్ గ్రేట్.. రికార్డులు రారాజు "కుక్"