రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానేకు భారీ జరిమానా

Ajinkya Rahane fined Rs 12 lakh for slow over rate
Highlights

ఐపిఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకు భారీ జరిమానా పడింది.

ముంబై: ఐపిఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకు భారీ జరిమానా పడింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా రహానేకు ఐపిఎల్ రూ.12 లక్షల జరిమానా విధించింది. 

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు కనీస ఓవర్ రేటును నమోదు చేయలేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేటుకు సంబంధించి ఇది రహానే మొదటి నేరం కావడంతో జరిమానాతో సరిపెట్టినట్లు కూడా తెలిపింది. ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ముంబై జట్టు 168 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాజ,స్థాన్ రాయల్స్ అలవోకగా విజయం సాధించింది. జోస్ బట్లర్ చెలరేగి ఆడి విజయాన్ని అందించాడు.  

loader