పసికూన ఆప్ఘాన్ పై విరుచుకుపడ్డ భారత బౌలర్లు, 109 పరుగులకు ఆలౌట్

afganistan team 109 all out in bangalore test
Highlights

ఫాలో ఆన్ ఆడనున్న అప్ఘాన్ జట్టు

బెంగళూరు టెస్టులో అప్ఘాన్ బ్యాట్ మెన్స్ కి టీం ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. భారత భౌలర్ల దాటికి తట్టుకోలేక అప్ఘాన్ టీం పెవిలియన్ కు క్యూ కట్టింది. కనీసం మూడంకెల స్కోరును కూడా సాధించలేక చతికిల పడింది. కేవలం భారత ఒపెనర్ శిఖర్ దావన్ సాధించిన 107 పరుగుల కంటే అప్ఘాన్ టీం మొత్తం కలిసి కేవలం 2 పరుగులు మాత్రమే అధికంగా సాధించింది. దీన్ని బట్టే అప్ఘాన్ బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో తెలుస్తోంది.  

రెండో రోజు అప్ఘాన్ జట్టు బాగా బౌలింగ్ చేసి కాస్త కాన్పిడెంట్ తో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఆ ధైర్యం కాసేపు కూడా నిలబడలేదు. ఆతిథ్య బౌలర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేస్తూ ఆదిలోనే అప్థాన్ కు కోలుకోలేని దెబ్బ తీశారు. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ షెజాద్(14) రనౌట్‌ కాగా, ఇషాంత్ వేసిన తరువాతి ఓవర్‌లో జావెద్ అహ్మదీ(1) క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా ఓపెనర్లు ఔటవడంతో అప్ఘాన్ జట్టు ఫీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇలా భారత భౌలర్ల విజృంబించడంతో ఏ దశలోను అప్ఘాన్ జట్టు భారత్ కు ఫోటీ ఇవ్వలేకపోయింది. ఫేసర్లు టాన్ ఆర్డర్ ని కట్టడి చేశారు. ఇక స్పిన్నర్ల రాకతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు కలిసి లోయర్ ఆర్డర్ ని కుప్పకూల్చారు. ఇలా సమిష్టిగా బౌలర్లు రాణించడంతో అప్ఘాన్ జట్టు మూడంకెల స్కోరును కూడా దాటడం కష్టమనిపించింది. ఈ దశలో మహ్మద్ నబీ కాస్త పోరాటమటిమతో 24 పరుగులు చేయడంతో ఈమాత్రం స్కోరైనా సాధించగలిగారు.

భారత బౌలర్లలలో రవిచంద్రన్ అశ్విన్ కేవలం 18 పరుగలే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ జడేజా రెండు వికెట్లు తీశాడు.ఇక ఫేసర్లు ఇఫాంత్ శర్మ 2, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. 

ఇలా అప్ఘానిస్థాన్ జట్టు కేవలం 27.5 ఓవర్లు మాత్రమే ఆడి 109 స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. అప్ఘాన్ ఇన్నింగ్స్ లో నబీ 24 పరుగలతో టాప్ స్కోరర్ కాగా, మహమ్మద్ షహజాద్(14), రహమత్ షా(14), అస్మతుల్లా షాహిది(11), అస్ఘర్(11), ముజీబుర్ రెహ్మాన్(15)లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.   


 

loader