మీరు గమనించారో లేదో.. మరణానికి ముందు కొన్ని గంటలు లేదా రోజుల్లో ఇలా మంచంలో ఉన్న వ్యక్తులు సడెన్ గా కోలుకుంటారు. చాలా కాలంగా కోమాలో ఉన్నవారు కూడా లేస్తారు లేదా.. మాట్లాడలేని వ్యక్తి అకస్మాత్తుగా స్పష్టంగా మాట్లాడతారు

పుట్టిన మనిషికి మరణం అనేది తప్పదు.కానీ, మరణం అనేది మనిషి జీవితంలో అత్యతం కఠినమైన దశ. మనకు నచ్చిన వారు, ప్రియమైన వారు చివరి శ్వాస తీసుకోవడం చూడటం చాలా బాధాకరం. మరణిస్తున్న వ్యక్తికీ, వారి కుటుంబ సభ్యులకూ ఇది చాలా బాధకరమైన విషయం. ఎప్పుడు మరణం ఎవరిని ఎలా చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ, కొందరు మాత్రం చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. మంచం మీద ఉంటూ మరణానికి దగ్గరలో ఉంటారు. వారు అలా మంచంలో ఉంటూ వారు ఎంత ఇబ్బంది పడుతుంటారో.. వారిని చూస్తూ కుటుంబ సభ్యులు కూడా అంతే బాధపడుతూ ఉంటారు.

టెర్మినల్ లూసిడిటీ అంటే ఏంటి..?

కొన్నిసార్లు, మీరు గమనించారో లేదో.. మరణానికి ముందు కొన్ని గంటలు లేదా రోజుల్లో ఇలా మంచంలో ఉన్న వ్యక్తులు సడెన్ గా కోలుకుంటారు. చాలా కాలంగా కోమాలో ఉన్నవారు కూడా లేస్తారు లేదా.. మాట్లాడలేని వ్యక్తి అకస్మాత్తుగా స్పష్టంగా మాట్లాడతారు, కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం, ఆనందంగా ఉండటం వంటి లక్షణాలు కనపిస్తాయి. కానీ.. అలా వారిలో సడెన్ గా వచ్చిన మార్పుకు ఆనందపడేలోగా..వారు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. దీనినే టెర్మినల్ లూసిడిటీ అంటారు. ఇది మరణానికి ముందు ఆ వ్యక్తికీ, కుటుంబానికి చివరలో కలిగే ఆనంద క్షణాలు ఇవి.

శాస్త్రీయ కారణాలు

టెర్మినల్ లూసిడిటీకి ఖచ్చితమైన శాస్త్రీయ కారణాలు ఇప్పటికీ తెలియవు. కొన్ని పరిశోధనలు, మెదడులోని న్యూరోకెమికల్ మార్పులు లేదా న్యూరోట్రాన్స్మిటర్ల తాత్కాలిక ఉద్భవం వల్ల ఇది సంభవిస్తుందనిపించాయి. మరికొంతమంది శాస్త్రవేత్తలు, శరీరం చివరి ప్రయత్నంగా మేల్కొలుపు మోడ్‌లోకి వెళుతుందని భావిస్తున్నారు.

భావోద్వేగ పరమైన ప్రాముఖ్యత..

చాలామంది కుటుంబ సభ్యులు ఈ స్పష్టతను దేవుడు ఇచ్చిన చివరి బహుమతి అని భావిస్తారు. వారాల తరబడి మాట్లాడని వ్యక్తి చివరిసారిగా నవ్వడం, మాట్లాడడం, వీడ్కోలు చెప్పడం కుటుంబ సభ్యులకు శాంతిని, ముగింపును ఇస్తుంది.

జీవించాలనే సంకల్పం

ఇంకొంతమంది, ఇది వ్యక్తిలోని జీవించాలనే సంకల్పానికి సంకేతమని నమ్ముతారు. చివరి క్షణాల్లో అయినా, మనస్సు, శరీరం కలిసి కొన్ని ఆనంద క్షణాలు ఇవ్వాలని ప్రయత్నిస్తాయని భావిస్తారు.

చివరగా, మరణానికి ముందు కనిపించే ఈ స్పష్టత ఒక మాయాజాలంలా ఉంటుంది. ఇది శాస్త్రానికి అంతుబట్టని విషయం అయినప్పటికీ, బాధలో ఉన్న కుటుంబాలకు ఇది తాత్కాలికమైన శాంతిని, ముగింపును ఇస్తుంది.