సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఉత్తరాయణ పుణ్య కాలం. ఈ నెల 14 నుండి ఉత్తరాయణం మొదలవుతోంది. మరి ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారో తెలుసుకుందాం.
ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాపకాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…ఆయనం అనగా పయనించడం అని అర్ధం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించడం అని అర్ధం.
సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి..దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. అయితే సూర్యుడు సంవత్సరంలో.. ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు.
సాధారణంగా ఉత్తరాయణం జనవరి 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. ( ఒక రోజు అటూ ఇటూ కావచ్చు ) దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. ( ఒక రోజు అటూ ఇటూ కావచ్చు ) ఉత్తరాయణంలో మరమాత్ముడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.
మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లనూ.. వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ ఉత్తరాయణకాలంను పుణ్యకాలంగా మన హిందువులు భావించారు.
అంతేగాక కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు.
ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. ఈ కాలం లోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు. ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీ మణులు పుష్పవతులు అవుతారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలం లోనే
బహుషా ఇలాంటి అనేక కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 13, 2021, 2:34 PM IST