Asianet News TeluguAsianet News Telugu

దేవుడు విగ్రహానికి పూజ చేస్తున్నారా..? లేక ఫోటోకి చేస్తున్నారా?

విగ్రహారాధనకు, ఫోటో పూజకు చాలా తేడా ఉంది. ఈ భేదం తెలియకుండా అదే పూజ చేస్తే భగవంతుడిని పూజించిన ఫలితం దక్కదు. విగ్రహారాధనకు, దేవుడి ఆరాధనకు మధ్య తేడాను మేము మీకు తెలియజేస్తాము.

Difference Between idol and picture worship
Author
First Published Nov 21, 2022, 3:38 PM IST


హిందువుల ప్రతి ఇంట్లో భగవంతుని పూజలు జరుగుతాయి. ఇంట్లో దేవుడికి  ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తూ ఉంటాు. కొందరైతే దేవుడి గదిలో  విగ్రహాలు పెట్టి పూజిస్తారు. కొంతమంది దేవుడి ఫోటో పెట్టుకుని పూజలు చేస్తుంటారు. కొందరి ఇంట్లో విగ్రహం, ఫోటో రెండూ పూజిస్తారు. ప్రతిరోజూ అక్షత, పసుపు, కుంకుమ పెట్టి, పూలు పెట్టి, హారతిచ్చి, దేవుడికి పూజలు చేస్తాం. విగ్రహం,ఫోటో రెండూ సాధారణంగా ఒకే విధంగా పూజిస్తారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఇది తప్పు. విగ్రహారాధనకు, ఫోటో పూజకు చాలా తేడా ఉంది. ఈ భేదం తెలియకుండా అదే పూజ చేస్తే భగవంతుడిని పూజించిన ఫలితం దక్కదు. విగ్రహారాధనకు, దేవుడి ఆరాధనకు మధ్య తేడాను మేము మీకు తెలియజేస్తాము.

విగ్రహారాధన, ఫోటో ఆరాధన మధ్య వ్యత్యాసం:
విగ్రహారాధనను సిద్ధారాధన అంటారు. ఫోటో పూజను మానస్ పూజ అంటారు. సిద్ధ ఆరాధన అంటే పూర్తి ఆచారాలు, పద్ధతుల ద్వారా చేసే ఆరాధన. మానస పూజ అంటే మానసికంగా అంటే మనసుతో చేసే పూజ.

విగ్రహారాధన సమయంలో ఎప్పుడూ ఒక ఆసనం మీద కూర్చోవాలి. అయితే ఫొటోకు పూజలు చేస్తూ సీటుపై కూర్చోవాల్సిన పనిలేదు.

విగ్రహారాధన చేసేవారు ప్రతిరోజు జలాభిషేకం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.  దేవుడి విగ్రహానికి పాలు, నెయ్యి తదితర పదార్థాలతో పాటు నీటితో అభిషేకం చేయవచ్చు. కానీ ఫోటో పూజలో అభిషేకం ముఖ్యం కాదు. ఫోటో పూజ చేసేటప్పుడు జలాభిషేకం చేయాల్సిన అవసరం లేదు.

మీరు ఇంట్లో లేదా దేవుడి వద్ద విగ్రహారాధన చేస్తే, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలి. అప్పుడే పూజ ప్రారంభించాలి. అయితే ఫోటో పూజలో దేవుడిని ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. దేవుడి ఇంట్లో దేవుడి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు.

మూర్తి పూజ సమయంలో మీరు పూజించే విగ్రహం పరిమాణం కూడా ముఖ్యమైనది. ఇంట్లో మీరు పూజించే విగ్రహం 6 అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదు. ఫోటో పూజలో ఎటువంటి నియమాలు వర్తించవు. మీరు ఏదైనా పెద్ద ఫోటోను ఉపయోగించవచ్చు.

మీరు విగ్రహారాధన చేసేటప్పుడు దేవుని బీజ మంత్రాన్ని జపించవచ్చు. కానీ ఫోటో పూజలో బీజ మంత్రాలు పఠించడం నిషిద్ధం.

భగవంతుడిని పూజించేటప్పుడు స్నానం చేసి శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. అనారోగ్యంతో స్నానం చేయలేక పోతే ఫోటో పూజ చేసుకోవచ్చు. ఫోటో పూజలో స్నానం చేయాల్సిన అవసరం లేదు. విగ్రహారాధనలో స్నానం తప్పనిసరి.

మీరు పూజ కోసం ఏ విగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు అనేది కూడా విగ్రహ పూజ సమయంలో ముఖ్యమైనది. మీరు అష్టధాతువులు లేదా బంగారు-వెండితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అయితే ఇవేవీ ఫోటోలకు వర్తించవు.

Follow Us:
Download App:
  • android
  • ios