Asianet News TeluguAsianet News Telugu

కొత్త ట్రైబ్యునల్ కు డిమాండ్

  • కొత్త ట్రైబ్యునల్ కు సిపిఐ డిమాండ్
  • కేంద్రంపై మండిపడ్డ నారాయణ
  • తెలుగు సిఎంలు మోడిని నిలదీయాలని సూచన
  •  
kaveri

కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. కావేరి జలాల పంపిణీపైన గాని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యవహారాలపైన గానీ కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకే మద్దతుగా నిలుస్తున్నట్లు నారాయణ ఆరోపించారు.

విజయవాడలో శనివార మీడియాతో మాట్లాడుతూ, కావేరి జలాల పంపిణీ వివాదంపై కేంద్రం కర్నాటకకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.

కావేరి జలాల సమస్యను పరిష్కరించటంలో భాగంగా కేంద్రం నాలుగు రాష్ట్రాల కోసం కొత్త ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయడు, కె. చంద్రశేఖర్ రావులకు చిత్తశుద్ది ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోడిని నిలదీయాలని సలహా ఇచ్చారు. పై రాష్ట్రాల్లో అయితే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వస్తాయని, తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు రావన్న ఉద్దేశ్యంతో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని నారాయణ మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios