సింగిల్ లైఫ్.. ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

నిజానికి లవర్ లేకపోవడమే ఉత్తమం అంటున్నారు శాస్త్రవెత్తలు.. లవర్ ఎవరూ లేకుండా.. సింగిల్ గా బతికేయడమే ఉత్తమమని చెబుతున్నారు

Why Single life is Good for Mental Health

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రేమికుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. కొందరు తమ మనసులోని ప్రేమను తాము ప్రేమించిన వ్యక్తికి తెలియజేసి ఉండొచ్చు.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు... గిఫ్ట్స్ ఇచ్చి మరింత ఇంప్రెస్ చేసి ఉండొచ్చు. లేదంటే ఆనందంగా ఎక్కడికైనా వెళ్లి సమయం గడిపి ఉండొచ్చు. వీళ్ల సంగతి ఒకే..  సింగిల్స్ ఏం చేసుంటారు..?

ఏముంది..ఛీ నా జీవితం అందరికీ లవర్స్ ఉన్నారు నాకు తప్ప.. అని తమని తామే తిట్టుకుంటూ ఉంటారు. అయితే... నిజానికి లవర్ లేకపోవడమే ఉత్తమం అంటున్నారు శాస్త్రవెత్తలు.. లవర్ ఎవరూ లేకుండా.. సింగిల్ గా బతికేయడమే ఉత్తమమని చెబుతున్నారు. సోలో లైఫ్ లో ఉన్నంత బెటర్.. కమిటెడ్ అయితే ఉండదని చెబుతున్నారు. దీని మీద ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మెప్పు కోసం తెగ ప్రయత్నిచడం వల్ల మానసికంగా అలసిపోయే ప్రమాదం ఉందని ఈ పరిశోధన చెబుతోంది. వారి దృష్టిలో ప్రపంచాన్ని చూడటం వల్ల స్వంత నిర్ణయాధికారాన్ని కోల్పోయి.. తమ మీద తమకు నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపింది. 

మానసిక సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. ఇలా ఆవేదన చెందే బదులు కొంత కాలం ఒంటరిగా ఉండి ఎవరికి వారు మానసికంగా ధృడపడాలని చెబుతోంది. ఒంటరి తనంలో ఉన్న వారు తమని తాము తెలుసుకోగలుగుతారని, తమపై తాము పూర్తి నియంత్రణ సాధిస్తారని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios