మెడికో ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి అవమానించాడు: వరంగల్ సీపీ రంగనాథ్

మెడికో ప్రీతిని  లక్ష్యంగా  చేసుకుని  సైఫ్  వేధింపులకు పాల్పడినట్టుటా  పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు.  

 Senior  Saif   harassed  Medico  Preethi  :warangal  CP   Ranganath

 వరంగల్:  మెడికో  ప్రీతిని  టార్గెట్ చేసి  సీనియర్  సైఫ్ వేదిలపులకు గురి చేసినట్టుగా  తేలిందని  వరంగల్ సీపీ  రంగనాథ్ చెప్పారు.  మెడికో  ప్రీతి ఆత్మహత్యాయత్నం  కేసులో  సైఫ్ ను  అరెస్ట్  చేశామని  రంగనాథ్  తెలిపారు. 

శుక్రవారంనాడు  వరంగల్ లోని తన  కార్యాలయంలో  వరంగల్ సీపీ  రంగనాథ్  మీడియాతో మాట్లాడారు. నిందితుడిపై  పలు  సెక్షన్లపై  కేసులు నమోదు చేసినట్టుగా  ఆయన చెప్పారు. సైఫ్  మెడికో  ప్రీతిని  వేధించినట్టుగా  ఆధారాలు లభ్యమయ్యాయన్నారు.  వాట్సాప్ గ్రూపులో  మేసేజ్ పెట్టి  డాక్టర్  ప్రీతిని వేధించినట్టుగా  గుర్తించామని ఆయన  తెలిపారు.   వాట్సాప్ గ్రూపులో  మేసేజ్ పెట్టి  అవమానించడం  ర్యాగింగ్  కిందకే వస్తుందని  సీపీ రంగనాథ్  వివరించారు.  గ్రూపుల్లో  మేసేజ్ లు  పెట్టి  తనను అవమానించవద్దని  సైఫ్  నకు  పర్సనల్ మేసేజ్ పెట్టి ప్రీతి వేడుకుందని  సీపీ రంగనాథ్  తెలిపారు.

తాను ఏదైనా తప్పు చేస్తే  తన హెచ్ఓడీ కి ఫిర్యాదు చేయాలని మెడికో ప్రీతి చెప్పిందన్నారు. ప్రీతిపై  సైఫ్  ఆధిపత్యం  చెలాయించే ప్రయత్నం  చేసినట్టుగా  విచారణలో తేలిందని  సీపీ రంగనాథ్  వివరించారు.  గత నాలుగు మాసాలుగా  సైఫ్ ను వేధింపులకు గురి చేసినట్టుగా  తాము గుర్తించినట్టుగా  సీపీ  రంగనాథ్ వివరించారు.  

   మెడికో ప్రీతికి సహకరించవద్దని  తన సహచరులకు  సైఫ్  వాట్సాప్ ద్వారా  మేసేజ్ లు పంపాడని  తాము గుర్తించామని  సీపీ చెప్పారు.  ఈ నెల  20వ తేదీన సైఫ్  వేధింపుల గురించి  ప్రీతి  తన పేరేంట్స్ కు  చెప్పిందని   సీపీ తెలిపారు.  ఈ నెల  21న    ప్రీతి, సైఫ్ లకు కాలేజీ యాజమాన్యం   కౌన్సిలింగ్  ఇచ్చారని  చెప్పారు.  పాయిజన్  ఇంజక్షన్  ఏముందనే విషయమై  ప్రీతి గూగుల్ లో  వెతికినట్టుగా తాము గుర్తించినట్టుగా  సీపీ తెలిపారు. 
 
ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల  22వ తేదీన ప్రీతి  ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నామని  సీపీ  చెప్పారు.  ఈ విషయమై  టాక్సాలజీ రిపోర్టు వస్తే  ప్రీతి  ఆరోగ్యం క్షీణించడానికి  కారణాలు తేలుతాయన్నారు.  

 ప్రీతి   కేసు విషయంలో  పోలీసుల నుండి ఎలాంటి నిర్లక్ష్యం లేదని  ఆయన స్పష్టం చేశారు. మరో వైపు  ఈ కేసులో  ఎలాంటి రాజకీయాలు  లేవన్నారు. ఈ కేసును పక్కదారిని పట్టించేందుకు  ప్రయత్నించలేదని  సీపీ  తేల్చి చెప్పారు.  

also read:కిడ్నీ, గుండె పనితీరు మెరుగు: మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల

మెడికో  ప్రీతికి అనారోగ్య  సమస్యలున్నందున  ఆమె  ఏమైనా మెడిసిన్ తీసుకొని  ఉండొచ్చని  కాలేజీ వైద్యులు  చెబుతున్నారన్నారు.  అయితే టాక్సాలజీ రిపోర్టులో  వాస్తవాలు తేలుతాయని  ఆయన  చెప్పారు.  ఈ కేసు విషయమై  సీనియర్లు,  జూనియర్లను  కూడా విచారిస్తామన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios