కిడ్నీ, గుండె పనితీరు మెరుగు: మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిపుణులైన వైద్యుల బృందం డాక్టర్ ప్రీతి ఆరోగ్యాన్ని పరిశీలిస్తుందని వైద్యులు వివరించారు.
హైదరాబాద్: వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు శుక్రవారం నాడు ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రీతికి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని హెల్త్ బులెటిన్ తెలిపింది. ప్రీతి గుండె, కిడ్నీ పనితీరు కొంచెం మెరుగైందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిపుణులైన వైద్య బృందం ప్రీతిని నిశితంగా పరిశీలిస్తుందని నిమ్స్ వైద్యులు వివరించారు.
ఈ నెల 22వ తేదీన మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందా లేదా అనే విషయం ఇంకా విచారణ కమిటీ నిర్ధారించనుందని వైద్యులు చెబుతున్నారు.
మెడికో ప్రీతిని సినియర్ సైఫ్ వేధింపులకు గురి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం డాక్టర్ ప్రీతిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులోయ సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఇవాళ మధ్యాహ్నం వరంగల్ సీపీ మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.