తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి మరోసారి విమర్శలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  కాగా... ఈ తీర్పుపై దాదాపు అన్నీ పార్టీలు పాజిటివ్ గా స్పందించారు. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించడంలేదు.

దీంతో... దీనిపై విజయశాంతి ఫేస్ బుక్ వేదికగా మండిపడ్డారు. సుప్రీం తీర్పుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 

AlsoRead rtc strike: అలా అయితే ఆర్థిక శాఖను కూడా ప్రైవేట్ పరం చేయాలి: విజయశాంతి...

అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా తప్పించుకోవడం వెనుక చాలా మతలబు ఉన్నట్లు స్పష్టమౌతోందనది ఆమె అన్నారు. దేశమంతా రామమందిర నిర్మాణానికి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు.

పైకి మాత్రం తాను అసలైన హిందువు అంటూ చెప్పుకునే కేసీఆర్.. లోలోపల మాత్రం రామ మందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్ చూస్తే అర్థమౌతోందన్నారు.

రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని... అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కెసిఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో అని ప్రశ్నించారు.  దీన్నే కుహనా లౌకిక వాదం అంటారని ఆమె దుయ్యబట్టారు.