బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కనపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందొ... 

pawan kalyan alliance with BJP: janasena to get a central ministerial berth?

యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన పొత్తుకు తెరతీశారు. దాని ప్రభావం ఉంటుందా ఉండదా అనేది పక్కకు పెడితే... ఒక నూతన రాజకీయ సమీకరణం అని మాత్రం చెప్పక తప్పదు.

అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తొలిసారి రాజకీయ వేదికపైకెక్కిన పవన్ కళ్యాణ్ ఆతరువాత స్తబ్దుగా మారిపోయాడు. అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినతరువాతయితే ఊసే లేదు. 

ఇక 2014 ఎన్నికలకు ముందు, తాను ఒక పార్టీ పెడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. జనసేన ఆవిర్భావం కూడా జరిగింది. పవన్ ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు. ఆతరువాత కొన్ని రోజుల్లో ఉన్న ఎన్నికలకు పార్టీ అప్పుడే సిద్ధంగా లేనందున టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించి, ఆ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. 

ఏ సమస్య మీదనయినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయ చిత్రపటంపైన కనబడ లేదు. పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎద్దేవా కూడా చేసింది. 

Also read: ఫక్తు రాజకీయం: అప్పుడు అన్న చిరంజీవి...ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్

ఇక మధ్యలో అడపాదడపా ఉద్యమాలు చేసినా, ఆ ఫ్లో ని మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్. కానీ మల్లి 2019 ఎన్నికలు వచ్చేనాటికి మాత్రం పవన్ రాజకీయ క్షేత్రంలో బాగా యాక్టీవ్ అయ్యారు. 

పార్టీ పెట్టి 5యేండ్లు గడిచినప్పటికీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం పై మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టలేదు. ఆయన ఎంతసేపటికీ కూడా వన్ మ్యాన్ షోలా పార్టీని నడిపాడు తప్ప ఏనాడు కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో ఆసక్తిని కనబరచలేదు. 

ఇక అలా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. పవన్ కళ్యాణ్ కూడా పోటీచేసిన రెండు చోట్లా కూడా ఓడిపోయాడు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచాడు. 

ఇక అలాంటి ఘోర వైఫల్యం తరువాత కూడా పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనే ఉండి తేల్చుకుంటానని చెప్పాడు. చెప్పినట్టే ఇసుక దీక్ష చేసారు. వారికి మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. 

ఇలా ఎన్నికలయిపోయిన తరువాత నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆయనకు ఒక ఆలంబన అవసరం. టీడీపీవైపు చూద్దామంటే, వారే కుదేలయిపోయి ఉన్నారు. అయినప్పటికీ వారికి సంస్థాగత నిర్మాణం ఉండబట్టి రాజకీయంగా వచ్చిన నష్టం లేదు. కానీ చంద్రబాబే పార్టీని రక్షించుకోవడంలో తలమునకలై ఉన్నాడు. ఇలాంటప్పుడు చంద్రబాబు తన పార్టీకి ఒకింత అండగా ఉంటాడని భావించాడు. 

అందుకే ఎన్నికల తరువాత టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం మనకు కనబడింది. బహుశా, ప్రభుత్వం పై పోరాటం చేసేప్పుడు అన్ని పార్టీలు ఒక్కటవుతాయి కాబట్టి ఇలా అనిపించిందేమో, కానీ పవన్ టీడీపీకి దగ్గరగా ఉన్నదనేది మాత్రం వాస్తవం. 

Also read: బీహార్ ఫార్ములా: ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కనపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందొ... 

ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం ఎలా సాధ్యపడిందనేది అందరి మదిలో మెదులుతున్న ఒక సవాల్. బీజేపీతో పొత్తు అంటే ప్రస్తుతానికి అది ఆత్మహత్యసదృశమే అవుతుంది. 

ఇలా పవన్ కళ్యాణ్ ని ఎవరు ఒప్పించారు. ఎందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు జోరుగా నడుస్తున్న చర్చ. బీజేపీకి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ లీడర్ కావలి కాబట్టి వారు పవన్ మీద ప్రేమ చూపెట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. 

కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి కలవడం వెనుక మాత్రం ఒక జాతీయ పార్టీ సపోర్ట్ తోపాటు మరో అంశం కూడా దాగి ఉంది. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, పార్టీని పటిష్టపరుచుకునేందుకు వారికి ఒక కేంద్ర మంత్రి పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

జనసేనకు ఒక మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేదు అనే చర్చకు కూడా ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. అంతే కాకుండా జనసేన పెరిగితే, ఎటుబడి పవన్ ప్రస్తుతం కాషాయిజాన్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి, తమకన్నా పెద్ద హిందుత్వ పార్టీ లేదు కాబట్టి, ఆ మైలేజ్ అంతా కూడా తమ క్రెడిట్లోకి వేసుకోవచ్చుఅని బీజేపీ భావిస్తుంది. 

ఇలాంటి అన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో జనసేనకు కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం డిసైడ్ అయింది. సరే మంత్రి పదవి ఇస్తారు. మరి జనసేనలో ఎవరు?

దీనికి సమాధానం కావాలంటే.... ఒక ఆరు నెలలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. జులై 2019లో అనూహ్యంగా జనసేనలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న మాజీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రి, నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరారు. 

అప్పట్లో అందరూ ఈ వయసులో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్ ఎందుకు బీజేపీలో చేరవలిసి వచ్చిందని అనుకున్నారు. వాస్తవానికి అప్పటినుండి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి లోకి జనసేన ఎంట్రీకి ప్రణాళికలు మొదలయ్యాయి.

తన తండ్రి ద్వారా బీజేపీకి జనసేనను దగ్గరచేసే పనిని నాదెండ్ల మనోహర్ తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అక్కడి నుండి మొదలు జనసేనను బీజేపీకి దగ్గరదగ్గరగా జరిపే ప్రయత్నం మొదలయింది. 

Also read; బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే...

ఇలా జనసేనకు-బీజేపీకి మధ్య వారధిగా వ్యవహారాన్నంతా చక్కబెట్టాడు నాదెండ్ల. ఇలా ఈ పనంతా కష్టపడి చేసినందుకు నాదెండ్ల మనోహర్ కు కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. 

ఇక్కడే మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేనకు ఇచ్చినప్పుడు పవన్ కల్యాణే నేరుగా తీసుకోవచ్చు కదా? పవన్ కి 2014లోనే బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది. కానీ పవన్ మాత్రం దానికి అప్పటి నుండి ఇప్పటివరకు సుముఖంగా లేరు. బహుశా అన్న చిరంజీవి ఎఫెక్ట్ ఏమో. 

పవన్ ఇప్పుడు పింక్ చిత్రం రీమేక్ లో నటిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉండి అవన్నీ చేయడం కుదరని పని. రాష్ట్రంలో పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తే ఆ బాధ్యతలు ఎంతకాదన్నా భారమవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్థుడయిన నాదెండ్ల మనోహర్ పేరును కేంద్ర మంత్రి పదవికి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర కాబినెట్ విస్తరణ ఉండనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios