కవిత ఇష్యూ: కరుణానిధి, పవార్ బాటల్లోనే కేసీఆర్

తెలంగాణాలో పార్లమెంటరీ ఎన్నికలైపోయిన తరువాత నుంచి కేసీఆర్ కూతురు కవిత అంతలా మనకు బహిరంగ వేదికలపైన కనపడడం లేదు.కేసీఆర్ కవితను అసెంబ్లీకి కూడా పంపకుండా ఉండడానికి వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉన్నదనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూసినా ఆ వాదనకు మరింత బలం చేకూర్చేవిలా ఉన్నాయి. 

kcr follows the footsteps of karunanidhi and sharad pawar in deciding kavita's future

తెలంగాణాలో పార్లమెంటరీ ఎన్నికలైపోయిన తరువాత నుంచి కేసీఆర్ కూతురు కవిత అంతలా మనకు బహిరంగ వేదికలపైన కనపడడం లేదు. ఆమె స్వయంగా దగ్గరుండి పునర్వైభవం తీసుకువచ్చిన  వేడుకల్లో కూడా అన్నీ  వ్యవహరించే కవిత, ఈ పర్యాయం ఆ వేడుకలకు దూరంగా ఉంది.  

కవిత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందడంతో జగిత్యాల శాసనసభ్యుడు తాను రాజీనామా చేసి కవితను అసెంబ్లీకి గెలిపించుకుంటామని స్వామీ భక్తిని ప్రకటించినా, ఎందుకో కవిత కానీ, కేసీఆర్ కానీ ఆ విషయంగా పెద్ద దృష్టి సారించలేదని మనకు అర్థమవుతుంది. మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సైతం  అక్కడ కవిత పోటీ చేస్తుందని ప్రచారం వినిపించినా చివరకు అదంతా పుకారుగానే మిగిలిపోయింది. 

కేసీఆర్ ఇలా కవితను అసెంబ్లీకి కూడా పంపకుండా ఉండడానికి వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉన్నదనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూసినా ఆ వాదనకు మరింత బలం చేకూర్చేవిలా ఉన్నాయి. 

Also read: కేకే స్థానంలో రాజ్యసభకు కవిత: నాయని నర్సింహా రెడ్డికి ఝలక్?

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ ఎంపీ కే కేశవరావు పదవీకాలం ముగియబోతోంది. ఇప్పటికే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ సీనియర్ల కు మంగళం పాడారు. తనతోపాటు ఉద్యమకాలం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి ఇతర సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. 

ఇప్పుడు కేకేను కూడా రాష్ట్ర రాజకీయాల్లో వాడుకోవాలని, తన పక్కనే తన తోపాటు పాలిటిక్స్ లో భాగం చేసుకోవాలని, కేకేను పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకరకంగా  ఇతర సీనియర్ల మాదిరే కేకేను సైతం పక్కకు పెట్టేసే మార్గాన్ని కెసిఆర్ ఎంచుకున్నట్టు మనము అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

ప్రస్తుతం ఢిల్లీలో టీఆర్ఎస్ లోక్ సభ శాసనసభా పక్ష నేతగా టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేత, ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. గులాబీ ఎంపీల్లో ఆ స్థాయి నేత లేకపోవడం, కవిత వినోద్ లాంటి వారు ఓడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామాను టీఆర్ఎస్ పక్ష నేతగా చేయాల్సి వచ్చింది.

టీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్, ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూతురుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇతర నేతలపై నమ్మకం లేకనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గులాబీ పార్టీ పై కల్వకుంట్ల ఫ్యామిలీ ముద్రను బలీయం చేయడానికే  కవితను మళ్లీ జాతీయపాలిటిక్స్ లో యాక్టివ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

ఒక విషయం గనుక గమనించి ఉంటే, ఇప్పటివరకు కవిత ఏ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. తెరాస పార్టీలోకి కవిత ఫుల్ టైం ఎంట్రీ ఇచినప్పటినుంచి తెరాస నేతలు చాలామంది కవితను కరుణానిధి కూతురు కనిమొళితో పోలుస్తుంటారు. కరుణ లాగానే కెసిఆర్ సైతం కూతురుని జాతీయ రాజకీయాలలోకి పంపించాలని ఆరంభం నుంచి ప్లన్స్ వేస్తున్నారు. 

Also read: ఎక్కడ మునుగుతానో ఎక్కడ తేలుతానో తెలీదు, మీరే రక్షించాలి: కేసీఆర్

శరద్ పవార్ కూతురు సుప్రియ సులే లాగ కవిత కూడా రాజకీయ పార్టీలకతీతంగా తన పరిచయాలను పెంచుకొని ఢిల్లీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ఎప్పటినుండో కెసిఆర్ కలలు కంటున్నారు. 

కవితను త్వరలోనే రాజ్యసభ ఎంపీని చేయబోతున్నట్టు వినిపిస్తుంది. నిజామాబాద్ లో ఓడిపోయాక కవిత పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. దారుణ పరాభవం నుంచి కోలుకో లేకపోతున్నారు. ఈ నేపథ్యం లోనే కవిత ను రాజ్యసభ ఎంపీగా పంపి మళ్లీ యాక్టివ్ చేయాలని కేసీఆర్ తలుస్తున్నట్టు అర్థమవుతుంది. 

ఇప్పటికే తనకు సన్నిహితుడైన కరీంనగర్ ఎంపీగా ఓడిన వినోద్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చేసి రాజకీయ ఆశ్రయం కల్పించిన కేసీఆర్.. ఇప్పుడు తన కూతురుకు జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఇక్కడ కెసిఆర్ కి తాజాగా సుప్రియ సూలే మహారాష్ట్ర రాజకీయాల్లో  నిర్వహించిన పాత్ర చాలా బాగా నచ్చిందట. ఈ సందర్భంగా సుప్రియ సూలే తన పరిచయాలను ఉపయోగించుకొని మహారాష్ట్రలో బీజేపీని కాదని ఎన్సీపీ చక్రం తిప్పడంలో పోషించిన పాత్ర పట్ల కెసిఆర్ బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ నేపథ్యంలో కేసీఆర్ త్వరలోనే కవితను రాజ్యసభకు పంపనున్నారనేది స్పష్టమవుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios