గజ్వేల్: తెలంగాణ మంత్రులతో సరదాగా ముచ్చటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో పర్యటించిన కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్నివిధాల తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 

గజ్వేల్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని తాను చెప్తున్నానని అయితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మంత్రులదేనని చెప్పుకొచ్చారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత మంత్రులదేనని వేదిక సాక్షిగా ఇదే తన రిక్వెస్ట్ అంటూ కేసీఆర్ కోరారు. 

ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. వైద్యరంగంలో ఆస్పత్రి నిర్మించుకున్నామని అలాగే ఎడ్యుకేషనల్ హబ్ ను కూడా నిర్మించుకున్నట్లు తెలిపారు కేసీఆర్. అలాగే బుధవారం వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ 27 కోట్లు నిధులు మంజూరు చేశారని ఆ నిధులతో చైల్డ్ అండ్ ఉమెన్ ఆస్పత్రి నిర్మించనున్నట్లు తెలిపారు. 

గజ్వేల నియోజకవర్గం తన నియోజకవర్గమని అయితే తాను ఎక్కడ మునుగుతున్నానో ఎక్కడ తేలుతానో తెలియదన్నారు. తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకే సమయం దొరకడం లేదని అందువల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. 

అందువల్ల మంత్రుల కనుచూపు తన నియోజకవర్గమైన గజ్వేల్ పై ఉండాలని కోరారు. మంత్రులు అంతా సమన్వయం చేసుకుని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని కోరారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డియే ఎమ్మెల్యే అనుకోవాలంటూ సెటైర్లు వేశారు. 

సీఎంపై మంత్రి హరీష్ పొగడ్తలు, తప్పు అన్న కేసీఆర్:ఇంతకీ ఏం జరిగిందంటే.....

జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కలెక్టర్ నుంచి ఏ ప్రపోజల్ చేసినా మంత్రులు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి  సాయం చేసిన మంత్రులకు తాను కూడా సాయం చేస్తానంటూ కేసీఆర్ అన్నారు. మంత్రులకు ఎలాగూ తన సాయం కావాల్సిందేనంటూ చెప్పడంతో అంతా నవ్వేశారు. 

అయితే తొలుత ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. హెల్త్ ప్రొఫైల్ ను గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ఆదేశించారు. త్వరలోనే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. 

మరోవైపు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మంత్రులు అంతా సహకరించాలన్నారు. అంతా కలిస్తే అది సాధ్యమేనని అందులోనా తన నియోజకవర్గం కావడంతో అది మరింత సాధ్యమవుతుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు వెలిశాయి. 

జనవరిలో గజ్వేల్ కు కాళేశ్వరం నీళ్లు, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: కేసీఆర్..