భువి, ధావన్, పాండ్యాల రీఎంట్రీ: వారి నుంచి టీమిండియా ఏం కోరుకుంటోంది?

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముగ్గురు క్రికెటర్లు పునరాగమనం చేస్తున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ధనాధన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌లు వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తున్నారు. 

India vs South Africa ODI series:What Team India is expecting from their re entry?

న్యూజీలాండ్ పర్యటనను పరాభవంతో ముగించిన భారత్... ఇప్పుడు ఆగాయాలను మర్చిపోయి తిరిగి పుంజుకోవడానికి ఒక చక్కని అవకాశం సౌతాఫ్రికా పర్యటనతో దక్కనుంది.

భారతదేశ పర్యటనకు వస్తున్న సఫారీల పోరు భారత జట్టు గాయాలను మాన్చడానికే కాకుండా.... ముగ్గురు రీఎంట్రీలు తమ ఫిట్నెస్ ని నిరూపించుకొని భారత జట్టులో తమదైన ముద్ర వేయడానికి ఆస్కారం కల్పిస్తుంది. 

2019 ఏడాది ఆఖర్లో భారత్‌కు వచ్చిన సఫారీలు టీ20 సిరీస్‌, టెస్టు సిరీస్‌ను కోల్పోయి వెళ్లిపోయారు. ఇప్పుడు వన్డే సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా మరోసారి భారత్ లో కాలుమోపింది. కోహ్లిసేనతో మూడు వన్డేల సిరీస్‌ కోసం నేటి నుంచి తలపడనుంది. 

Also read: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే: కివీస్ గాయం నుంచి బయటపడేనా...?

స్వదేశంలో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. రానున్న ఐపీఎల్‌ దృష్ట్యా ముగ్గురు కమ్ బ్యాక్ క్రికెటర్లపై ఈ సిరీస్‌లో ఎక్కువ ఫోకస్‌ కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా స్వదేశంలో ఆస్ట్రేలియాను 3-0తో వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడించి మంచి ఊపు మీదుంది. 

మరొపక్కనేమో భారత్ విదేశాల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ 0-3తో వైట్‌వాష్‌ ఓటమి మూటగట్టుకుంది. ఈ రెండు జట్లు ఇప్పుడు వన్డే సిరీస్‌ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. నేడు మార్చి 12న ధర్మశాల వన్డేతో సఫారీతో కోహ్లిసేన పోరు మొదలు కానుంది. 

ఆ తర్వాత లక్నో, కోల్‌కతలలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి. ఐపీఎల్‌కు పది రోజుల ముందు మార్చి 18న వన్డే సిరీస్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో భారత్‌ నుంచి ముగ్గురు క్రికెటర్లపై ఫోకస్‌ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఆ ముగ్గురు? వారు ఈ సిరీస్ లో మెప్పిస్తారు ఒకసారి చూద్దాం. 

రీఎంట్రీ బ్రహ్మాండంగా ఉండేనా?

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముగ్గురు క్రికెటర్లు పునరాగమనం చేస్తున్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, ధనాధన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌లు వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తున్నారు. 

ఈ ముగ్గురు చివరగా ఆస్ట్రేలియాతో వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌ తర్వాత శిఖర్‌ ధావన్‌ గాయంతో దూరమయ్యాడు. తర్వాత భువనేశ్వర్‌ కుమార్‌, అనంతరం హార్దిక్‌ పాండ్య సైతం గాయాలతో జట్టుకు దూరమయ్యారు. 

శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులోకి వచ్చినా.. ఎంతో సమయం ఫిట్‌గా ఉండలేదు. తొలి సిరీస్‌లోనే గాయాల పాలై మళ్లీ రీహాబిలిటేషన్ కు  వెళ్లిపోయారు. 

లండన్‌లో శస్త్రచికిత్స అనంతరం ముంబయిలోనే వ్యక్తిగత శిక్షకుడి వద్ద ట్రైనింగ్‌ తీసుకున్న హార్దిక్‌ పాండ్య న్యూజిలాండ్‌ పర్యటనలో రీ ఎంట్రీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కానీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ లేకపోవటంతో మళ్లీ లండన్‌కు వెళ్లి నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చింది. 

తాజాగా డివై పాటిల్‌ టీ20 టోర్నీలో విశ్వరూపం చూపించిన హార్దిక్‌ పాండ్య మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. ఈ ముగ్గురు చాన్నాండ్ల తర్వాత కలిసి బరిలోకి దిగబోతున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైంది. 

అంచనాలను అందుకొనేనా...?

ఫిట్‌నెస్‌ సాధించి, విరామం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకపోవటం మంచిది. తాజాగా డివై పాటిల్‌ టీ20 టోర్నీలో పాండ్య విశ్వరూపం చూపించాడు. 35 బంతుల్లో, 39 బంతుల్లో శతకాలు బాదాడు. 

Also read: క్రికెట్ పై కరోనా ఎఫెక్ట్...ఇక ఏ బౌలర్ అలా చేయడంటున్న భువీ

దీంతో పాండ్య సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు, ఇరగదీస్తాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. డివై పాటిల్‌ ముంబయి స్థానిక టోర్నీ. అక్కడ హార్దిక్‌ పాండ్య పరుగుల వేటలో, వికెట్ల వేటలో పెద్దగా చెమటోడ్చాల్సిన అవసరం లేదు. 

అంతర్జాతీయ అనుభవంతో సులభంగానే నెట్టుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అవసరాల మేరకు పాండ్య రాణిస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది. అంచనాల ఒత్తిడి పాండ్య వైఫల్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. దక్షిణాఫ్రికాపై పాండ్య పది ఓవర్లు బౌలింగ్‌ వేసేది సైతం అనుమానమే. 

స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గజ్జల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. పేస్‌ సహచరులు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమిలతో కలిసి బంతిని పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 

పునరాగమన సిరీస్‌లో మెప్పించిన శిఖర్‌ ధావన్‌.. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ధర్మశాల వన్డేకు ముందు ధావన్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. అయినా, దూకుడుగా ఆడే ధావన్‌కు సఫారీ సిరీస్‌ పెద్ద పరీక్ష కాబోదు. 

గాయాల నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ మగ్గురి నుంచి జట్టు ఇప్పుడే ఎక్కువగా ఆధారపడకూడదు. అంచనాలు పెంచుకోవద్దు. అప్పుడే కుదురుకుని, సహజశైలిలో రాణించేందుకు వీలుంటుంది. 

దక్షిణాఫ్రికా సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌ రానుండటంతో ఈ ముగ్గురు క్రికెటర్లు ఫామ్‌లోకి వచ్చేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికిప్పుడు వీరినుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ను ఆశించలేము. జట్టు మనగెమెంత్ కూడా వీరిపై ఇప్పటికిప్పుడే ఇలాంటి ప్రెజర్స్ పెట్టకపోవడమే మంచిది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios