Asianet News TeluguAsianet News Telugu

Farm laws repeal: ఎట్టకేలకు విజయం సాధించిన రైతులు.. మోదీ సాగు చట్టాల రద్దు నిర్ణయం వెనక కారణాలు ఇవేనా..?

ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు (farmers protest) ఎట్టకేలకు విజయం సాధించారు. అయితే ఇన్నాళ్లు ఈ చట్టాలపై రైతుల ఆందోళనలపై చూసిచూడనట్టుగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం.. ఒక్కసారిగా సాగు చట్టాలను రద్దు (Farm laws repeal) చేస్తున్నట్టుగా ప్రకటించడం వెనక చాలా కారణాలే ఉన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Here is The Key Things behind repeal of Farm laws By PM Modi
Author
New Delhi, First Published Nov 19, 2021, 11:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్న రైతులు (farmers protest) ఎట్టకేలకు విజయం సాధించారు. మూడు నూతన సాగు చట్టాలను రద్దు (Farm laws repeal) చేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. గతేడాది కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా,  పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు నవంబర్ 28, 2020 నుంచి ఢిల్లీ సరిహద్దు‌ల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసుకుని ఆందోళనలకు దిగారు. సింఘు, టిక్రీలలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారితో 11 రౌండ్ల చర్చలు జరిపింది. అయితే ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో రైతులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగలేదు. కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. రైతులు మాత్రం వాటిని వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని, తమ పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఇన్నాళ్లు ఈ చట్టాలపై రైతుల ఆందోళనలపై చూసిచూడనట్టుగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం.. ఒక్కసారిగా Farm lawsను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడం చాలా మందికి ఆశచ్చర్యానికి గురిచేసింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్న వాటి వెనకాలు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని వారు అంటున్నారు.

Also read: farm laws repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ

ఉప ఎన్నికల్లో ఓటమితో అప్రమత్తం.. 
ఇటీవల దేశంలోని 14 రాష్ట్రాలల్లోని 30 శాసనసభ స్థనాలకు, మూడు పార్లమెంట్‌ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు(by polls) జరగ్గా.. నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ చేదు ఫలితాలు వచ్చాయి. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన చోట్ల ఇతర ప్రాంతీయ పార్టీలు విజయం సాధించింది. మూడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన, బీజేపీలు.. ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

కర్ణాటలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగితే.. సిందగి నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకోగా, సీఎం బసవరాజ బొమ్మై సొంత జిల్లా హానగల్‌ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఆ పార్టీకి షాక్ తగిలిందనే చెప్పాలి. సీఎం జైరాం ఠాకూర్ సొంత జిల్లాలోని మండీ లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. మూడు చోట్ల అయితే బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. 

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించిందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే దీపావళికి ముందు రోజు(ఫలితాలు వెలువడిన మరసటి రోజు) పెట్రోల్, డిజీల్‌పై సుంకాన్ని తగ్గిసతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన ధరలు తగ్గించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తున్న ఉప ఎన్నికల ఫలితాల వెలువడిన రోజే ఇలాంటి ప్రకటన వెలువడటం గమనార్హం.

లఖింపూర్ ఖేరి ఘటనపై వ్యతిరేకత..
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో (lakhimpur kheri) సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మోదీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు ఈ ఘటనపై Uttar Pradesh ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరినీ కాపాడటానికి ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటన ముఖ్యంగా యూపీలో బీజేపీపై వ్యతిరేకతగా దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు భావించాయి. ముఖ్యంగా సాగు చట్టాలపై పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు రైతులు గుర్రుగా ఉన్నారు. వీరు నిరసన కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే వెలువడిన ఓ సర్వే కూడా ఒకింత అదే విషయాన్ని వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి యూపీలో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 239-245 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఉన్న యూపీలో.. పట్టు కోల్పోతే బీజేపీ రాబోయే కాలంలో ఇబ్బందులు తప్పవనే భావనకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని  బీజేపీకి యూపీ.. చాలా కీలక రాష్ట్రంగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. 

403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో.. అధికారం చేపట్టాలంటే మెజారిటీకి 202 సీట్లు కావాలి. సర్వేలో BJPకి 240 వరకు స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. ఒకవేళ ఎన్నికల నాటికి పరిస్తితులు ఏ మాత్రం మార్పులు చోటుచేసుకన్న, రైతులు ఉద్యమం ఉదృతం అయితే బీజేపీకి షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని.. ఈ కారణం చేతనే ఎలాంటి రిస్క్ తీసుకొవద్దనే ఉద్దేశంతో బీజేపీ చర్యలు ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయడం ద్వారా లఖింపూర్ ఖేరీ ఘటనపై చెలరేగిన వ్యతిరేకతను కొంతవరకైన తగ్గించవచ్చనే భావనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

పండగ సెంటిమెంట్‌తో పంజాబ్ రైతులను ఆకర్షించేలా.. 
అయితే సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన మోదీ.. తన ప్రసంగం ప్రారంభించే ముందు గురునానక్ జయంతి గురుపూర‌బ్ (Guru Nanak Gurpurab) సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా కార్తార్‌పూర్ కారిడార్‌ను ఒక‌టిన్న‌ర‌ ఏళ్ల త‌ర్వాత రీఓపెన్ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. దీనిబట్టి సాగు చట్టాల రద్దు నిర్ణయం వెనక మోదీ భారీ కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. రైతు ఆందోళనలో ఎక్కువగా పాల్గొంటున్నది.. పంజాబ్ రైతులే. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకునే మోదీ.. అక్కడి వారి అత్యంత పవిత్రమైన గురుపూరబ్ రోజే ఈ ప్రకటన వెలువడటమే నిదర్శనమని చర్చ సాగుతుంది.

వచ్చ ఏడాది ఎన్నికలు జరగనున్న వాటిలో పంజాబ్ కూడా ఉంది. అయితే 2017కు ముందు పదేళ్లేపాటు అకాలీదశ్ కూటమితో పంజాబ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలతో అధికారం చేజిక్కుచుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లకు, బీజేపీ 3 సీట్లకు పరిమితమయ్యాయి. అయితే ఈసారి అక్కడ.. కాంగ్రెస్ నుంచి అమరీందర్ సింగ్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, ఆప్‌ కూడా పంజాబ్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం.. ఇలాంటి అంశాల నేపథ్యంలో బీజేపీ అక్కడి అంశాలను అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలో Punjab బీజేపీ నేతలు ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) కలిశారు. రైతు నిరసనలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, కర్తార్‌పూర్ కారిడార్ (kartarpur corridor) తదతర అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీ జరిగిన కొద్ది రోజుల్లోనే రైతు చట్టాలను రద్దు చేస్తూ మోదీ నిర్ణయాన్ని వెల్లడించారు. అది కూడా గురుపూరబ్ పర్వదినం నాడే కావడం.. సెంటిమెంట్‌పై కొట్టినట్టేనని, సాగు చట్టాల రద్దు వెనక పంజాబ్ ఎన్నికలు కూడా కీలక భూమిక పోషించినట్టుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే సర్వేలు మాత్రం పంజాబ్‌లో బీజేపీ విజయం సాధ్యకకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక, వచ్చే ఏడాది.. మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios